telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

ఫిష్ పకోడి

1/25/2014

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు:
చేపలు - 2 
కోడిగుడ్లు - 2
కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్
కారం - ఒక టీ స్పూన్
నిమ్మరసం - 2 స్పూన్స్
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత

తయారు చేసే విధానం :
  • చేపలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
  • కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. 
  • ఒక గిన్నెలో కోడిగుడ్లను బాగా గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. 
  • ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి. ఏదైనా చట్నీతో లాగిస్తే మరింత ఉంటాయి ఫిష్ పకోడీలు!



0 Comments

ఆలూ టిక్కా

1/7/2014

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - 3
క్యారెట్‌, బీన్స్‌
క్యాలీఫ్లవర్‌ - 100 గ్రాములు
జీలకర్ర - 1 టీ స్పూన్‌,

మిరియాల పొడి - పావు టీ స్పూన్‌
పసుపు - అర టీ స్పూన్‌,

అల్లం - 50 గ్రాములు
చాట్‌ మసాలా - పావు టీ స్పూన్‌
కొత్తిమీర - 1 కట్ట,

పుదీనా - 1 కట్ట
ఉప్పు - సరిపడా,

కారం - తగినంత,
నూనె - తగినంత

తయారీ విధానం
  • బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మెదపాలి.
  • క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి.
  • అందులో జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, పుదీనా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కొద్దిగా అదమాలి.
  • వీటిని పెనంమీద నూనెతో కాల్చుకుని పైన చాట్‌ మసాలా చల్లాలి.

0 Comments

బేల్ పూరి

1/3/2014

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
మరమరాలు - 100 గ్రాములు,

టమాటాలు - 10 గ్రాములు,
ఉల్లిగడ్డ - 1,
కొత్తిమీర - 1 కట్ట,
కట్టామీటా చట్నీ - టేబుల్‌ స్పూన్‌,
కారం - 3 గ్రాములు,
చాట్‌ మసాలా - 3 గ్రాములు,
నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు,
సేవ్‌ - 20 గ్రాములు
ఉప్పు - తగినంత

తయారీ విధానం
  • ఉల్లిగడ్డ, టమాట, పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి.
  • ఓ గిన్నెలో కట్టామీటా చట్నీ, ఉప్పు, కారం, చాట్‌మసాలా కలపాలి.
  • అందులోనే మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేటట్టు తిప్పాలి.
  • చివర్లో సేవ్‌, కొత్తిమీర తరుగు చల్లుకుంటే చాలు.

0 Comments

రాగి పిండి బిస్కెట్స్‌

12/25/2013

0 Comments

 
Picture
కావలసిన వస్తువులు: 
ఓట్స్‌- 100గ్రాములు, 
రాగివిండి- 50గ్రాములు, 
వాము - కొద్దిగా, 
చక్కెర - 2 టేబుల్‌ స్పన్‌, 
ఉప్పు - 1/2 టీస్పూన్‌
వెన్న - 1 టీస్పూన్‌


తయారుచేసే విధానం: 
ఓట్స్‌ కాస్త్త వెన్న వేసి వేయించి పొడి చేసుకుని, అందులో రాగి పిండి వాము, ఉప్పు, చక్కెర వేసి కాస్తనీరు చిలకరించి పిండి కలిపి చపాతి లాగా రుద్ది షేప్‌లో కట్‌ చేసుకుని ఓవెన్లో 15ని పాటు 45 డిగ్రీల వద్ద బేక్‌ చేసుకుంటే మంచి కరకరలాడే టేస్టీ ఓట్స్‌ - రాగిపిండి బిస్కెట్స్‌ తయారవుతాయి. ఇవి చాల రుచిగా ఉంటాయి. ఓవెన్‌ లేనివారు కుక్కర్‌లో ఇసుక వేసి అందులో ఒక ప్లేట్  మీద బిస్కెట్స్‌ పెట్టి గ్యాస్‌కెట్‌ లేకుండ మూత పెట్టి సన్నని మంటమీద 15 నిలు వేడిచేసుకోవాలి. బిస్కెట్స్‌ రెడీ అవుతాయి. 

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

పనీర్ పాలకూర బాల్స్

12/19/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్‌ముక్కలు-పది,
పాలకూర-కట్ట
అల్లం,పచ్చిమిర్చిముద్ద-అరచెంచా,

వెల్లుల్లి ముద్ద-అరచెంచా
గరంమసాలా-అరచెంచా,

నిమ్మరసం-చెక్క
ఉప్పు-రుచికి తగినంత,

పనీర్‌-150 గ్రా.

మారినేషన్‌ కోసం
నిమ్మరసం-చెంచా,

అల్లం,పచ్చిమిర్చి ముద్ద-అరచెంచా
వెల్లుల్లిముద్ద-అరచెంచా,

మిరియాల పొడి-పావుచెంచా
మొక్కజొన్న పిండి-తగినంత,

నూనె-వేయించడానికి తగినంత

తయారుచేసే విధానం
  • మొక్కజొన్న పిండి, నూనె కాకుండా మిగతా మారినేషన్‌ పదార్థాలు, పనీర్‌ను గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి.
  • తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు బ్రెడ్‌ముక్కల చివర్లు తీసేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకోవాలి.
  • అందులో పాలకూర తరుగు, మారినేట్‌ చేసిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేర్చుతూ బాగా కలపాలి.
  • బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని వేయించుకోవాలి.
  • బాగా వేగాక దించేస్తే పనీర్‌ పాలకూర బాల్స్‌ సిద్ధమయినట్టే. వీటిని చల్లటి సాయంత్రం వేళ టమాటాసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.

0 Comments

ఎగ్ బాల్స్

12/15/2013

0 Comments

 
Picture
కావలసినవి:
ఉడికించిన గుడ్లు - నాలుగు,

గుడ్డు - ఒకటి,
బ్రెడ్ క్రంబ్స్ - వందగ్రాములు,
వెల్లుల్లి - నాలుగు,
పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి),
ఉప్పు - ఒక టీస్పూన్,
నూనె- వేగించడానికి సరిపడా.


తయారీ:
ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన కార్చి అందులోనే బ్రెడ్ క్రంబ్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నాలుగు సమభాగాలుగా చేయాలి.
చేతులకి నూనె పూసుకుని ఒక్కో భాగాన్ని గుండ్రంగా ఆలు పాటీల్లా చేయాలి. ఒక్కో పాటీ మధ్యలో ఉడికించిన గుడ్డుని ఉంచి గుడ్డు బయటకి కనిపించకుండా దాని చుట్టూరా ఆ మిశ్రమం సర్దాలి.
పైపూత ఎండిపోకుండా ఉండేందుకు వీటిని గిన్నెలో ఉంచి మూతపెట్టాలి. అన్ని గుడ్లకి పూత పూయడం అయ్యాక కళాయిలో నూనె వేడిచేసి గుడ్లను ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎగ్ బాల్స్ రెడీ.

0 Comments

గోబీ పకోడీ

12/5/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - 1,

మిరియాల పొడి - 2 స్పూన్స్,
శనగపిండి - 4 స్పూన్స్,
కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు,
జీలకర్ర - ఒక టీ స్పూన్ ,
ఇంగువ - అర టీ స్పూన్,
పసుపు - ఒక టీ స్పూన్,
కారం - ఒక టీ స్పూన్,
కొత్తిమీర - ఒక కట్ట,
ఉప్పు, నూనె - తగినంత

తయారు చేసే విధానం :
  • కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి.
  • పచ్చిమిరపకాయలను, వెల్లుల్లిపాయలను మిక్సీ చేయాలి. దీన్ని కాలీఫ్లవర్‌లో కలుపుకోవాలి.
  • దీంట్లో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.
  • ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కో ముక్కను నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. వేడి.. వేడి పకోడీ మీ ముందుంటుంది.


0 Comments

సర్వపిండి

11/21/2013

0 Comments

 
Picture
కావలసినవి:
బియ్యప్పిండి - 3 కప్పులు;
నువ్వుపప్పు, పల్లీలు, ఉల్లికాడల తరుగు - పావు కప్పు చొప్పున;
ఉల్లితరుగు - అర కప్పు;
వెల్లుల్లి తరుగు - టీ స్పూను;
కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు;
కరివేపాకు తరుగు - టేబుల్ స్పూను;
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను;
ఉప్పు - తగినంత;
కారం - కొద్దిగా;
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా;
పుట్నాలపప్పు, నానబెట్టిన శనగపప్పు, క్యారట్ తురుము - పావు కప్పు చొప్పున;
ధనియాలు, అల్లం రసం - టీ స్పూను చొప్పున.

తయారి:
  • నువ్వుపప్పు, పల్లీలను విడివిడిగా సుమారు గంటసేపు నానబెట్టాలి. ఉల్లితరుగును మిక్సీ పట్టాలి (మరీ మెత్తగా అవ్వకూడదు) ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, నానబెట్టి వడకట్టిన నువ్వుపప్పు, పల్లీలు, ఉప్పు, పచ్చిమిర్చితరుగు, కారం, వెల్లుల్లితరుగు, ఉల్లికాడల తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లితరుగు, పుట్నాలపప్పు, నానబెట్టిన శనగపప్పు, క్యారట్ తురుము వేసి బాగా కలపాలి.
  • కొద్దిగా నీరు జత చేసి పిండి గట్టిగా ఉండేలా కలపాలి.
  • పిండిని చిన్న ఉండలా చేతిలోకి తీసుకుని, నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద చేతి వేళ్లతో పల్చగా అద్దాలి.
  • ఇలా మొత్తం పిండినంతా తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్నవాటిని ఒకటొకటిగా వేస్తూ బాగా వేగిన తరువాత తీసేయాలి.

0 Comments

గోబీ మంచురియా

11/16/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - 1,

మైదా - 3/4 కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్స్,
కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,
ఆలుగడ్డ - 1,
ఉల్లిగడ్డ -1,
అజినామొటో - పావు టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
టమాటా సాస్ - 2 స్పూన్స్,
సోయాసాస్ - 2 స్పూన్స్,
కొత్తిమీర - అర కట్ట,
నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
  • గోబీని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  • ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
  • కడాయిలో నూనె పోయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమంలో గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో అజినామొటో, సోయాసాస్, టమాటా సాస్ వేసి కలపాలి.
  • ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న గోబీని ఇందులో వేసి మరికాసేపు కలియబెట్టాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. గార్నిష్ చేసిన గోబీ మంచురియా మీ నోరూరించక మానదు!


0 Comments

టమోటా బజ్జీ

11/15/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

టమోటాలు : నాలుగు
బంగాళ దుంపలు : రెండు
ఉల్లిపాయ : ఒకటి,
కరివేపాకు : ఒక రెబ్బ
ఆవాలు, జీలకర్ర : ఒక టీ స్పూను
కారం : రెండు టీ స్పూన్లు
పచ్చిమిరపకాయలు : రెండు
పసుపు : చిటికెడు
శెనగపిండి : రెండు టేబుల్‌ స్పూన్లు
మొక్కజొన్న పిండి : రెండు టేబుల్‌ స్పూన్లు
వరి పిండి : ఒక టేబుల్‌ స్పూను
ఉప్పు : తగినంత
వంట సోడా : చిటికెడు
నూనె : సరిపడా

తయారు చేయు విధానం:

ముందుగా బంగాళా దుంపలతో కూర వండి పెట్టుకోవాలి. తర్వాత టమోటాల్ని శుభ్రంగా కడిగి మధ్యలో గాటు పెట్టి గుజ్జంతా తీసేయాలి. అందులో బంగాళ దుంప కూర పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో శెనగపిండి, వరిపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, సోడా, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఇందులో ఆలు కూర కూర్చిన టమోటాల్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి వేగించి తీసేయాలి.



0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    రగ్ డా పట్టి
    ఎగ్ కట్ లెట్స్
    ఎగ్ చాట్
    ఎగ్ బజ్జీ
    ఆలూ టిక్కా
    ఎగ్ బాల్స్
    ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్
    ఎగ్ బుర్జీ సాండ్‌విచ్
    ఆలూ పన్నీర్ చాట్
    ఎగ్ మంచూరియా
    బేల్ పూరి
    పానీ పూరి
    లెహ్ సుని టిక్కి
    ఫిష్ పకోడి
    రైస్ పకోడి
    దాల్ కచోరి
    గోబీ పకోడీ
    చాకో బనానా సాండ్ విచ్
    మీల్ మేకర్ మంచూరియా
    రాగి పిండి బిస్కెట్స్‌
    కీమా టిక్కీ
    జాలీ మిర్చి
    గోబీ మంచురియా
    కబాబ్
    సమోసా రగడ
    బఠానీ చాట్
    మూంగ్ దాల్
    సాండ్ విచ్ డోక్లా
    పాలక్ పకోడి
    టమోటా బజ్జీ
    ఓట్స్ శాండ్ విచ్
    మొలకల ఫ్రూట్ భేల్
    పనీర్ పాలకూర బాల్స్
    బ్రెడ్ పాన్ కేక్
    గ్రీన్ పీస్ పూరీ
    గ్రీన్ పీస్ ధోక్లా
    బ్రెడ్ బజ్జీ
    పాలకూర పకోడీ
    యాపిల్ బజ్జీ
    బ్రెడ్ సమోసా
    సేమియా పకోడీ
    సొరకాయ పకోడి
    దోసకాయ బజ్జీ
    టొమాటో బోండా
    గుత్తి వంకాయ బజ్జీ
    అటుకుల టిక్కి
    పొటాటో బైట్స్
    తందూరీ టిక్కా
    స్వీట్ కార్న్
    బ్రెడ్ పిజ్జా
    కార్న్ టిక్కి
    సేమ్యా టిక్కి
    బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్
    చిల్లీ పన్నీర్
    బ్రెడ్ పన్నీర్ రోల్
    బ్రెడ్ మంచురియా
    సకినాలు
    చెక్కలు
    కట్లెట్
    పన్నీర్ బజ్జీ
    పన్నీర్ పకోడీ
    దొండకాయ బజ్జీ
    పన్నీర్ పకోడి
    హరియాలి టిక్కి
    పన్నీర్ బాల్స్
    స్టఫ్డ్ మిర్చి బజ్జీ
    నర్గీసీ కబాబ్స్
    పన్నీర్ సిగార్స్
    ప్రాన్స్
    నూడుల్స్ ప్రై
    క్యాబేజీ బోండా
    పానీపూరీ మసాలా మురుకులు
    చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...
    అమెరికన్ చాప్‌సూయి
    సర్వపిండి
    మామిడికాయ పకోడీ
    మొక్కజొన్న కబాబ్
    మీల్‌మేకర్ పకోడీ
    మొక్కజొన్న కట్లెట్
    జాక్‌ఫ్రూట్‌ మసాలా బాల్స్‌
    3314e5f8bf
    34955b7e6b
    4331cfd919
    మొక్కజొన్నకర్రీ 65
    F7c5f54312

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.