స్వీట్ కార్న్ : 1 కప్పు
మైదా : అరకప్పు
బ్రెడ్ పొడి : అరకప్పు
వెన్న : 5 చెంచాలు
పాలు : అరకప్పు
ఉప్పు,నూనె : తగినంత
తయారుచేసే విధానం:
మైదాలో నీళ్ళు పోసి జారుడుగా కలపాలి. స్వీట్ కార్న్ ని నీటిలో ఉడికించాలి. పాలలో వెన్న వేసి మరిగించి, చిక్కగా అయ్యాక స్వీట్ కార్న్ ను వేసి గట్టిగా అయ్యేవరకు ఉడికించాలి. (కాస్త కొత్తిమీర తగిలిస్తే ఇంకా బాగుంటుంది) తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని, మైదా పిండిలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి. వీటిని నూనెలో వేయిస్తే స్వీట్ కార్న్ బాల్స్ రెడీ..
మూలం : సాక్షి ఆదివారం పుస్తకం