బియ్యం : నాలుగు కప్పులు
నువ్వులు : ఒక కప్పు
ఉప్పు : తగినంత
వాము : తగినంత
నూనె : సరిపడా
తయారుచేసే పద్ధతి :
బియ్యం కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టిన తర్వాత నీళ్ళు వార్చి శుభ్రమైన బట్టపై పోసి కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించాలి. నువ్వులను సన్నని మంటపై వేయించి పిండిలో పోయాలి. వాము, ఉప్పు కూడా వేసి నీళ్ళు పోసి కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ లో పిండిని తీసుకొని బట్టపై మడుగుపూలు (మురుకులు) లాగానే చేత్తోనే నాలుగైదు వరుసలు చుట్టాలి. ఈ విధంగానే పిండినంత చేసుకోవాలి. తర్వాత కాగిన నూనెలో వాటిని వేయించి తీయాలి. ఈ సకినాలు కొన్నాళ్ళు నిల్వ ఉంటాయి. అవసరమైన వారు కొంచెం కారప్పొడి కూడా వేసుకోవచ్చు.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం