తెల్ల బఠానీలు - కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి ముద్ద - టీస్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద - అరటీస్పూన్
ఆవాలు - అరటీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
కారం - టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - టీస్పూన్
జీలకర్ర పొడి - అరటీస్పూన్
ధనియాల పొడి - అరటీస్పూన్
మిరియాల పొడి - అరటీస్పూన్
పసుపు - అరటీస్పూన్
గరం మసాలా - టీస్పూన్
పట్టీల (బిళ్ళల) కోసం :
బంగాళాదుంపలు - 5
పచ్చిమిర్చి - 2
అల్లం తురుము - టీస్పూన్
నూనె - టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ - టీస్పూన్
బ్రెడ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - పావుటీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
అలంకరించేందుకు
కారప్పూస - కప్పు
చాట్ మసాలా - టీస్పూన్
ఉల్లిపాయలు - రెండు
కొత్తిమీర తురుము - అరకప్పు
చింతపండు చట్నీ - అరకప్పు
తయారుచేసే పద్ధతి:
- బఠానీలను సుమారు పది గంటలు నానబెట్టాలి. వీటిలో ఐదు కప్పుల నీటిని పోసి ఉప్పు, చిటికెడు సోడా వేసి ఫ్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూడు లేక నాలుగు నిముషాలు వేయించాలి. ఉల్లి ముక్కలు వేగాక ఉడికించిన బఠానీలు వేసి వేయించాలి. తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
- ఇప్పుడు బాణలిలోని సగం బఠానీలు పక్కకు తీసి మెత్తగా మెదిపి మళ్లీ అందులోనే వేయాలి. తరువాత కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి పది నిముషాలు ఉడికించి పక్కన ఉంచాలి.
- పట్టీల తయారి :
- బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం తురుము, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్రెడ్ పొడి, పసుపు వేసి కలపాలి.
- మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకొని గుండ్రని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండని తీసుకొని వేళ్ళతో అర అంగుళం మందంలో వత్తి చిన్న బిళ్ళల్లా చేయాలి.
- ఇప్పుడు వీటిని నాన్ స్టిక్ పాన్ లో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీయాలి.
- ప్లేటులో రెండు పట్టీలు పెట్టి పైన రెండు టేబుల్ స్పూన్ల రగ్ డా వేసి, ఆ పైన చింతపండు చట్నీ, ఉల్లి ముక్కలు, కొత్తిమీర తురుము, కారప్పూస వేసి, చాట్ మసాలా పొడి చల్లి వేడిగా అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం