దోసకాయ ముక్కలు - ఒక కప్పు,
బంగాళాదుంప ముక్కలు - ఒక కప్పు,
క్యాబేజీ తరుగు - ఒక కప్పు,
ఉల్లిపాయ - ఒకటి,
పచ్చిమిర్చి - ఆరు,
కొత్తిమీర తరుగు - ఒక కప్పు,
తోటకూర కాడలు - అరకప్పు,
అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర స్పూన్,
మొక్కజొన్నపిండి - ఒక కప్పు,
గోధుమపిండి - ఒక కప్పు,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - వేగించడానికి సరిపడా,
జీలకర్ర - ఒక టీస్పూన్,
నువ్వులు - ఒక టీస్పూన్,
కరివేపాకు రెబ్బలు - కొన్ని,
బేకింగ్ సోడా - చిటికెడు.
తయారుచేసే పద్ధతి:
- బంగాళాదుంప, క్యాబేజిలను కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.
- ఒక గిన్నె తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, గోధుమపిండి, ఉడికించిన బంగాళాదుంప, క్యాబేజి ముక్కలు, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు, తోటకూర కాడలు, కొత్తిమీర, అల్లంవెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కరివేపాకులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి రెండు స్పూన్ల నూనె, ఒక గ్లాసు నీళ్లు పోసి కలపాలి. అవసరమనుకుంటే మరికొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు.
- కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. పిండిని చేతిలోకి తీసుకుని నచ్చిన ఆకారంలో చేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించి బయటకు తీయాలి. దోసకాయ బజ్జీ రెడీ. వేడివేడిగా చిల్లీ లేదా టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక