telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

బ్రెడ్ పాన్ కేక్

6/27/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు          - 10; 
పాలు                    - ఒక కప్పు
ఉల్లితరుగు             - అర కప్పు; 
క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు    - పావు కప్పు; 
బంగాళదుంప తురుము - అర కప్పు; 
పచ్చిమిర్చి            - టేబుల్ స్పూన్; 
అల్లంతురుము       - టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు     - 2 టేబుల్ స్పూన్లు; 
ఉప్పు            -తగినంత
కారం            - అర టీ స్పూను; 
గరంమసాలా - అర టీ స్పూను
నూనె           - సరిపడా

తయారుచేసే పద్ధతి:
బ్రెడ్‌స్లైసుల అంచులను తీసేసి, బ్రెడ్‌ను పొడిలా చేసి, అర కప్పు పాలలో పదినిముషాలు నానబెట్టాలి.
పాలు తప్ప మిగిలిన వస్తువులన్నీ ఒక గిన్నెలో వేసి, నూనె కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.
 పాలు జతచేసి దోసె మిశ్రమంలా తయారుచేయాలి కొద్దిగా జిగురుగా ఉండాలి. లేదంటే మరీ మెత్తగా అయిపోయి, సరిగా రావు.
 స్టౌ మీద పాన్ ఉంచి, వేడయ్యాక నూనె రాయాలి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పెనం మీద వేసి, దోసె మాదిరిగా కొద్దిగా మందంగా వేయాలి. గోధుమరంగులోకి మారాక రెండవవైపు తిప్పి కాలనివ్వాలి.

మూలం : సాక్షి దినపత్రిక

0 Comments

సేమియా పకోడీ 

6/26/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
సేమియా                - ఒక కప్పు, 
శెనగపిండి               - ఒక కప్పు, 
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు, 
అల్లం పేస్ట్                - అర స్పూన్, 
కరివేపాకు రెబ్బలు   - కొన్ని, 
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, 
బేకింగ్ పౌడర్ - చిటికెడు, 
కారం - ఒక స్పూన్, 
ఉప్పు - రుచికి సరిపడా, 
నూనె - వేగించడానికి సరిపడా.

తయారుచేసే పద్ధతి : 
  • స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేగించాలి. 
  • ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి. 
  • ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలపాలి. 
  • తరువాత కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి వేగించాలి. సేమియా బజ్జీలు సిద్ధం.

మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

సొరకాయ పకోడి

6/26/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు : 
సొరకాయ (పొట్టుతీసి, తురిమి) - ఒకటి (మీడియం సైజ్) 
శెనగపిండి                        - ఒక కప్పు
బియ్యప్పిండి                    - రెండు టీస్పూన్లు 
ఉల్లిపాయ (సన్నగా తరిగి) - ఒకటి (మీడియం సైజ్) 
వెల్లుల్లి రెబ్బలు (సన్నటి ముక్కలు) - నాలుగు
పచ్చిమిర్చి (సన్నగా తరిగి) - మూడు
చాట్ మసాలా, కారం        - ఒక్కో టీస్పూన్ చొప్పున 
పసుపు              - కొద్దిగా, 
బ్లాక్ సాల్ట్            - అర టీస్పూన్, 
కొత్తిమీర తురుము - ఒక టేబుల్ స్పూన్, 
ఉప్పు                - రుచికి తగినంత, 
నూనె                - వేగించడానికి సరిపడా.

తయారుచేసే పద్ధతి :
  • శెనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చాట్‌మసాల, కారం, పసుపు, బ్లాక్‌సాల్ట్, కొత్తిమీర తరుగు - వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మిశ్రమం మరీ జారుగా కాకుండా జాగ్రత్తపడాలి. 
  • తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు వేసి ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు నూనెలో వేసి వేగించాలి. వేగాక బ్లాటింగ్ పేపర్ మీద వేస్తే నూనెని పీల్చుకుంటుంది. వేడివేడిగా టొమాటో కెచప్‌తో తినండి.

మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

పన్నీర్ బాల్స్ 

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్       -           20 గ్రా. (తురమాలి)
గరం మసాలా  -        టీస్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్ట్ -     టీస్పూన్ 
పసుపు        -          కొద్దిగా 
నూనె           -         తగినంత 
ఉప్పు          -          తగినంత 
కారం           -          టీస్పూన్ 
                                                                  కొత్తిమీర       -          కొద్దిగా 
                                                                  మైదా          -           10 గ్రా.
                                                                 కార్న్ ఫ్లోర్    -            10 గ్రా. 

తయారుచేసే పద్ధతి :
  • పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్ గా చేసుకొని ఒక ప్లేటులో ఉంచుకోవాలి.
  • స్టవ్ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి, పేపర్ ప్లేటులో ఉంచాలి.
  • పచ్చిమిర్చి, ఉల్లి చక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

బ్రెడ్ మంచురియా

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్         -            ఏడు 
ఉల్లిపాయ          -            ఒకటి 
క్యారెట్              -            ఒకటి  
వెల్లుల్లి రెబ్బలు   -            పన్నెండు 
అల్లం                -            చిన్న ముక్క 
పన్నీర్ తురుము -            అర కప్పు 
కొత్తిమీర తరుగు  -            కొద్దిగా 
మైదా               -             కప్పు 
బియ్యప్పిండి       -            అరకప్పు 
సోయాసాస్         -            చెంచ 
వెనిగర్              -            రెండు చెంచాలు 
మిరియాల పొడి   -            అర చెంచ 
ఉప్పు               -             తగినంత 
పచ్చిమిర్చి         -             రెండు 
నూనె                -             వేయించడానికి సరిపడా
టొమాటో సాస్     -             నాలుగు చెంచాలు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ -             అర చెంచ 

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా బ్రెడ్ స్లైసుల అంచుల్ని కత్తిరించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా నీళ్ళు చల్లి ముద్దలా కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి తరుగు, పన్నీర్ తరుగు, కొత్తిమీర తరుగు, మైదా, బియ్యప్పిండి, సరిపడా ఉప్పు వేసి నీళ్ళు చల్లుతూ గట్టి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. 
  • పొయ్యి మీద మరో బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి, కాగాక ముందుగా వేయించి పెట్టుకున్న మంచురియా ఉండలు, సోయాసాస్, వెనిగర్, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరికొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. రెండు లేక మూడు నిమిషాలయ్యాక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఈ మంచురియాను వేడివేడిగా టొమాటో సాస్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. 

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

బ్రెడ్ రోల్స్ 

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్         -            ఎనిమిది (పెద్దవి)
క్యారెట్ తురుము -            కప్పు 
పన్నీర్ తురుము -            పావు కప్పు 
మిరియాల పొడి   -            పావు చెంచ 
ఉప్పు               -             తగినంత 
ఉల్లిపాయ ముక్కలు -         పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ 
పచ్చిమిర్చి         -             రెండు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
                                                                  నూనె                -             వేయించడానికి సరిపడా
                                                                   వెన్న                -             చెంచ 
                                                                    కారం                -             అరచెంచ 

తయారుచేసే పద్ధతి :

ముందుగా బాణలిలో వెన్న కరిగించి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. అందులోనే పన్నీర్ తురుము కూడా వేసి రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి కలిపి దించేయాలి. 
ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచుల్ని కత్తిరించి మధ్యలో క్యారెట్ మిశ్రమాన్ని రెండు చెంచాలు ఉంచి రోల్ లా చుట్టేయాలి. క్యారెట్ మిశ్రమం బయటకు రాకుండా ఉండేందుకు చేయి తడి చేసుకొని అంచుల్ని మూసేయాలి. ఇలా మిగిలిన స్లైసుల్ని కూడా చేసుకొని కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించుకొని తీసేస్తే నోరూరించే బ్రెడ్ రోల్స్ సిద్దం.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

బ్రెడ్ పిజ్జా

6/12/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్         -            ఆరు 
వెన్న                -        రెండు చెంచాలు 
ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికం - ఒక్కొక్కటి చొప్పున 
చీజ్ తురుము     -             అరకప్పు 
టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్ - పావు కప్పు 
ఉప్పు, మిరియాల పొడి -       తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమును సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా వెన్న రాసి దానిపైన టొమాటో కెచప్ లేదా పిజ్జా సాస్ ను టాపింగ్ లా రాయాలి. పైన తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పరిచి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. దానిపైన తగినంత చీజ్ ను పరవాలి. ఇలా మిగిలిన స్లైసులను కూడా చేయాలి. 
  • వీటన్నింటిని ఓవెన్ లో మూడు లేక నాలుగు నిముషాలు బేక్ చేస్తే సరిపోతుంది. పైన కావాలనుకుంటే మరికాస్త మిరియాల పొడి చల్లుకోవచ్చు. ఈ పిజ్జా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

ఇన్  స్టంట్ బ్రెడ్ మిక్సర్ 

6/12/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్         -            ఏడు
బూందీ             -             అరకప్పు 
ఉడికించిన ఆలూ -           మూడు (మెదపాలి )
దానిమ్మ గింజలు -           పావుకప్పు 
చాట్ మసాలా     -            అరచెంచ 
ఉప్పు              -             తగినంత 
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు 
కొత్తిమీర తరుగు -             కొద్దిగా 
                                                                  నూనె              -              వేయించడానికి సరిపడా 
                                                                  నిమ్మరసం       -               రెండు చెంచాలు 

తయారుచేసే పద్ధతి :
  • బ్రెడ్ స్లైసుల అంచుల్ని తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ బ్రెడ్ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి. 
  • ఓ గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకొని బాగా కలపాలి. తినే ముందు నిమ్మరసం కలిపితే సరిపోతుంది. చాలా సులువుగా చేసుకొనే ఈ ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ ఎంతో రుచిగా ఉంటుంది.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

మొలకల ఫ్రూట్ భేల్

6/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
మరమరాలు      -           కప్పు 
సన్న కారప్పూస -          కప్పు 
దానిమ్మ గింజలు -          కప్పు
యాపిల్ ముక్కలు -        అరకప్పు 
ద్రాక్ష                  -         కప్పు 
కమలా ఫలం తొనలు -    కొన్ని
నిమ్మరసం          -        రెండు చెంచాలు 
మిరియాల పొడి    -        రెండు చెంచాలు 
మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు - రెండు కలిపి కప్పు 
వాము పొడి       -           అరచెంచా
                                                                   కొత్తిమీర తరుగు -           కొద్దిగా 
                                                                   ఉప్పు              -           తగినంత 


తయారుచేసే పద్ధతి :
  • ఓ గిన్నెలో మరమరాలు, సన్న కారప్పూస తీసుకొని బాగా కలిపి, మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు కూడా వేసేయాలి. ఇప్పుడు వాము పొడి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత పండ్ల ముక్కలు, కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలా నిమ్మరసం కూడా వేస్తే నోరూరించే భేల్ సిద్దం.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

పాలకూర పకోడీ 

6/7/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పాలకూర           -             మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి)
శెనగ పిండి         -             ఒకటిన్నర కప్పు 
బియ్యప్పిండి       -             రెండున్నర కప్పులు 
కారం పొడి          -             ఒక టీస్పూన్ 
జీలకర్ర పొడి        -             అరటీస్పూన్
అల్లం                 -             అరటీస్పూన్
పుదీనా              -             రెండు టేబుల్ స్పూన్లు  (సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర             -              రెండు టేబుల్ స్పూన్లు 
నూనె                 -             వేయించుకోవడానికి సరిపడా
                                                                    ఉప్పు                -              తగినంత 
                                                                   వేడి చేసిన నూనె  -              2 టేబుల్ స్పూన్లు 

తయారుచేసే పద్ధతి :
ఒక గిన్నెలో పాలకూర ఆకుల ముక్కలు, శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. 
తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ రెడీ. గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి. 

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    రగ్ డా పట్టి
    ఎగ్ కట్ లెట్స్
    ఎగ్ చాట్
    ఎగ్ బజ్జీ
    ఆలూ టిక్కా
    ఎగ్ బాల్స్
    ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్
    ఎగ్ బుర్జీ సాండ్‌విచ్
    ఆలూ పన్నీర్ చాట్
    ఎగ్ మంచూరియా
    బేల్ పూరి
    పానీ పూరి
    లెహ్ సుని టిక్కి
    ఫిష్ పకోడి
    రైస్ పకోడి
    దాల్ కచోరి
    గోబీ పకోడీ
    చాకో బనానా సాండ్ విచ్
    మీల్ మేకర్ మంచూరియా
    రాగి పిండి బిస్కెట్స్‌
    కీమా టిక్కీ
    జాలీ మిర్చి
    గోబీ మంచురియా
    కబాబ్
    సమోసా రగడ
    బఠానీ చాట్
    మూంగ్ దాల్
    సాండ్ విచ్ డోక్లా
    పాలక్ పకోడి
    టమోటా బజ్జీ
    ఓట్స్ శాండ్ విచ్
    మొలకల ఫ్రూట్ భేల్
    పనీర్ పాలకూర బాల్స్
    బ్రెడ్ పాన్ కేక్
    గ్రీన్ పీస్ పూరీ
    గ్రీన్ పీస్ ధోక్లా
    బ్రెడ్ బజ్జీ
    పాలకూర పకోడీ
    యాపిల్ బజ్జీ
    బ్రెడ్ సమోసా
    సేమియా పకోడీ
    సొరకాయ పకోడి
    దోసకాయ బజ్జీ
    టొమాటో బోండా
    గుత్తి వంకాయ బజ్జీ
    అటుకుల టిక్కి
    పొటాటో బైట్స్
    తందూరీ టిక్కా
    స్వీట్ కార్న్
    బ్రెడ్ పిజ్జా
    కార్న్ టిక్కి
    సేమ్యా టిక్కి
    బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్
    చిల్లీ పన్నీర్
    బ్రెడ్ పన్నీర్ రోల్
    బ్రెడ్ మంచురియా
    సకినాలు
    చెక్కలు
    కట్లెట్
    పన్నీర్ బజ్జీ
    పన్నీర్ పకోడీ
    దొండకాయ బజ్జీ
    పన్నీర్ పకోడి
    హరియాలి టిక్కి
    పన్నీర్ బాల్స్
    స్టఫ్డ్ మిర్చి బజ్జీ
    నర్గీసీ కబాబ్స్
    పన్నీర్ సిగార్స్
    ప్రాన్స్
    నూడుల్స్ ప్రై
    క్యాబేజీ బోండా
    పానీపూరీ మసాలా మురుకులు
    చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...
    అమెరికన్ చాప్‌సూయి
    సర్వపిండి
    మామిడికాయ పకోడీ
    మొక్కజొన్న కబాబ్
    మీల్‌మేకర్ పకోడీ
    మొక్కజొన్న కట్లెట్
    జాక్‌ఫ్రూట్‌ మసాలా బాల్స్‌
    3314e5f8bf
    34955b7e6b
    4331cfd919
    మొక్కజొన్నకర్రీ 65
    F7c5f54312

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.