కాలీఫ్లవర్ - 1,
మైదా - 3/4 కప్పు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్స్,
కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,
ఆలుగడ్డ - 1,
ఉల్లిగడ్డ -1,
అజినామొటో - పావు టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
టమాటా సాస్ - 2 స్పూన్స్,
సోయాసాస్ - 2 స్పూన్స్,
కొత్తిమీర - అర కట్ట,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
- గోబీని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
- ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, నీళ్లు పోసి కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
- కడాయిలో నూనె పోయాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమంలో గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో అజినామొటో, సోయాసాస్, టమాటా సాస్ వేసి కలపాలి.
- ఐదు నిమిషాల తర్వాత వేయించుకున్న గోబీని ఇందులో వేసి మరికాసేపు కలియబెట్టాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. గార్నిష్ చేసిన గోబీ మంచురియా మీ నోరూరించక మానదు!