గోధుమపిండి - ఒక కప్పు,
మైదా - ఒక కప్పు,
బఠాణీలు - అర కప్పు,
అల్లం పేస్ట్ - పావు టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
గరం మసాలా పౌడర్ - పావు టీ స్పూన్,
జీలకర్ర - పావు టీ స్పూన్,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
బఠాణీల్లో కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. నీళ్ళని వడకట్టి దాంట్లో అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పౌడర్, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూరీల కోసం చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కో దాన్ని తీసుకొని గుండ్రంగా వత్తాలి. దీంట్లో బఠాణీ మిశ్రమాన్ని వేసి మడిచి మళ్లీ పూరీల్లా చేసుకోవాలి. ఇలా అన్ని చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. వేరే కూరలేకుండా ఈ పూరీలనే లాగించేయొచ్చు.