బేబీకార్న్ ముక్కలు-నాలుగు కప్పులు
శనగపిండి-ఒక కప్పు,
మైదాపిండి-ఒక కప్పు
ఉప్పు, కారం - తగినంత,
టమాటాసాస్-మూడు చెంచాలు
వెల్లులిరెబ్బలు-నాలుగు,
సన్నగా తరిగిన ఉల్లికాడ ముక్కలు-అరకప్పు
బీన్స్ ముక్కలు-పావు కప్పు,
కరివేపాకు-రెండు రెమ్మలు,
కొత్తిమీర -కొద్దిగా
నూనె-రెండు టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
బేబీకార్న్ ముక్కల్ని ఉప్పు వేసిన నీళ్లలో ఉడికించి నీళ్లు వంపి వేయాలి. ఇప్పుడు మరో పాత్రలో శనగపిండి, మైదాపిండి తగినంత ఉప్పు, కారం వేసి నీటిని చేర్చి పిండిలా కలపాలి. ఇందులో బేబీకార్న్ ముక్కల్ని ముంచి కాగుతున్న నూనెలో వేయించాలి. మరొక పాత్రలో నాలుగు చెంచాల నూనె వేసి కరివేపాకు, వెల్లుల్లి తాలింపు పెట్టాలి. అందులో వేగిన బేబీకార్న్ ముక్కల్ని వేయాలి. తర్వాత వాటికి టమాటాసాస్ కొత్తిమీర తురుము చేర్చాలి. దీనికి ముందుగా ఉల్లికాడలు, బీన్స్‌ముక్కలు కూడా వేయాలి. వీటన్నిటిని ఐదునిమిషాల పాటు వేయిస్తే బేబీకార్న్ 65కర్రీ సిద్ధమవుతుంది.