అటుకులు - 2 కప్పులు
బంగాళాదుంపలు - 3
మొక్కజొన్న పిండి - కప్పు
చిల్లీ సాస్ - 2 టీస్పూన్లు
టొమాటో సాస్ - 2 టీస్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం వెల్లుల్లి - టీస్పూన్
కొత్తిమీర తురుము - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెదపాలి.
- అందులో మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర తురుము, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, అటుకులు కలపాలి.
- మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి అరచేతిలోనే గుండ్రని పట్టీల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం