పాలకూర ఆకులు - 25
శనగపిండి - 10ఱగా.
బియ్యం పిండి - 2 స్పూన్స్
జీలకర్ర - అర టీ స్పూన్
వెల్లుల్లిపాయలు - 4
పచ్చిమిరపకాయలు - 2
బేకింగ్ సోడా - కొద్దిగా
కారం - ఒక టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
పాలకూర బాగా కడిగి కాడలను తీసేసి గాలికి ఆరబెట్టాలి. వెల్లుల్లిపాయలను, పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, బేకింగ్ సోడా, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేసి నీళ్ళు పోసి కలుపుకోవాలి. అయితే కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా, నీళ్ళు ఎక్కువకాకుండా జాగ్రత్తపడాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని పక్కకు ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఇలా చేయడం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ఆకును తీసుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి వేయాలి. లేత బంగారు వర్ణం వచ్చేవరకు కాల్చాలి. వేడి.. వేడి పాలక్ పకోడీ రెడీ!