
ఉడికించి నలిపించు కున్న పనస (జాక్‌ఫ్రూ ట్) ముక్కలు : అర కప్పు)
ఉడికించి నలిపి ఉంచిన బంగాళాదుంప ముక్కలు : అర కప్పు
బరకగా నూరిన వేరుశెనగ గింజల పొడి : 1 టీస్పూన్
ఉల్లిపాయ తరుగు :: అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
స్కిమ్‌డ్ మిల్క్ : అర కప్పు
పసుపుపొడి : ఒక టీస్పూన్
బ్లాక్ పెప్పర్ పొడి : ఒక టీస్పూన్
జీలకర్ర పొడి : ఒక టీస్పూన్
ధనియాలపొడి : ఒక టీస్పూన్
కొత్తిమీర తరుగు : ఒక టీస్పూన్
నూనె : ఒక టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు : ఒక టీస్పూన్
ఉప్పు : ఒక టీస్పూన్
తయారీ విధానం...
- ఒక నాన్‌స్టిక్ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో బ్లాక్ పెప్పర్, ధనియాల పొడి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి.
- ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. ఇందులోనే వేరుశెనగ గింజల పొడి, పసుపుపొడి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి.
- తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.
- చివరగా స్కిమ్‌డ్ మిల్క్ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి. మిశ్రమం అంతా దగ్గర పడ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారిన తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన జాక్‌ఫ్రూట్ పొటాటో బాల్స్ రెడీ. తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి ఇవి బాగా తోడ్పడతాయి
మూలం : సూర్య దినపత్రిక