మెంతి ఆకు - 100 గ్రా.
పాలకూర - 100 గ్రా.
పనీర్ తురుము - 150 గ్రా.
వెల్లుల్లి - ఒక టీస్పూన్
నెయ్యి - 50 m .l
పచ్చిమిరపకాయల పేస్ట్ - అరచెంచ
జీడిపప్పు - రెండు టీస్పూన్లు
ఉల్లిపాయలు - రెండు లేక మూడు
కసూరి మేతి - అరటీస్పూన్
టొమాటోలు - రెండు లేక మూడు
ఉప్పు - తగినంత
గరం మసాలా పొడి - అరటీస్పూన్
కారం - అరటీస్పూన్
ధనియాల పొడి - ఒక టీస్పూన్
క్రీమ్ - రెండు టీస్పూన్లు
తయారుచేసే పద్ధతి :
టొమాటో, ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. గరం మసాలా, ఉప్పు వేసి నూనెలో వేసి ఉడికించాలి. వెల్లుల్లి, ముందే ఉడికించిన మెంతి, పాలకూర కలపాలి. కసూరిమేతి కలపాలి. సన్నని సెగపై కొద్దిసేపు ఉడికించి పనీర్ తురుము కలపాలి. చిక్కబడ్డాక క్రీమ్ కలిపి దించేయాలి. చపాతీలకు మంచి కాంబినేషన్.
మూలం : స్వాతి సపరివార పత్రిక