పన్నీర్ ముక్కలు-అరకేజి,
ఉల్లిపాయలు-2,
టమాట-2,
గరంమసాలా-ఒక చెంచా
అల్లం, వెల్లుల్లి పేస్ట్-రెండు చెంచాలు
కారం-ఒక చెంచా,
ధనియాలపొడి-ఒకచెంచా
పసుపు-పావు చెంచా
ఉప్పు-రుచికి తగినంత
మీగడ-అరకప్పు
నూనె-పావు చెంచా
తయారుచేసే విధానం
- ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు వేయించాలి.
- తరువాత పన్నీర్ ముక్కలు వేసి మసాలా వాటిని బాగా పట్టేవరకు వేయించాలి. చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి కలియబెట్టి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి. అంతే మలైపన్నీర్ రెడీ.
మూలం : వార్త దినపత్రిక