ములగ ఆకులు - రెండు కప్పులు
పెసరపప్పు - అరకప్పు
క్యారెట్ - ఒకటి
ఫ్రెంచ్ బీన్స్ - ఐదారు
బంగాళదుంప - ఒకటి
పచ్చిమిరపకాయలు - 3-4
అల్లం ముక్క - అంగుళం
పసుపు - పావు టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
నిమ్మరసం - రెండు టీస్పూన్లు
కరివేపాకు - కొద్దిగా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ - రెండు చిటికెలు
తయారుచేసే పద్ధతి :
ములగ ఆకు శుభ్రముగా కడిగి వడకట్టాలి. ఫ్రెజర్ కుక్కర్ లో సగం నూనె వేడి చేసి అందులో తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్, ఒక పచ్చిమిరపకాయలను వేయాలి. పప్పు కడిగి రెండు కప్పుల నీళ్ళలో ముందే నానబెట్టి ఉంచుకోవాలి. పప్పు వడకట్టి కలపాలి. రెండు మూడు నిముషాలు వేయించాలి.
బంగాళదుంప తురుము, ములగ ఆకులు, అల్లం వేసి రెండు కప్పుల వేడి నీరు కలుపుకోవాలి. అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి.
కుక్కర్ స్టీం విడుదలయ్యాక రుచి కోసం నిమ్మకాయరసం కలపాలి. మిగతా నూనె చిన్న ప్యాన్ లో వేడి చేసి తాలింపు గింజలన్నీ వేసి, చిటపటలాడక కరివేపాకు, ఇంగువ, మిగతా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ తాలింపుని కుర్మాలో కలపాలి. కలియబెట్టాలి. ఇది అన్నానికి, చపాతిలకి మంచి కాంబినేషన్.
మూలం : స్వాతి సపరివార పత్రిక