పొట్లకాయ - 1
ఉల్లి తరుగు - అరకప్పు
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగ పప్పు - అరటీస్పూన్ చొప్పున
ఉప్పు - తగినంత
నూనె - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 6
వెల్లుల్లి రేకలు - 6
వేరుశనగ పప్పులు- అరకప్పు
కరివేపాకు - 4 రెమ్మలు
పసుపు - అరటీస్పూన్
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర తరుగు - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
పొట్లకాయను ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు కలిపి, కప్పు నీటితో ఉడికించాలి(ముక్క సగం ఉడికితే చాలు). ఎండుమిర్చి, వెరుశనగపప్పులను విడివిడిగా వేగించి వెల్లుల్లితో కలిపి పొడి చేయాలి. నూనెలో తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉల్లితరుగు వేగించి ఉడికిన పొట్లకాయ ముక్కలు కలపాలి. 5 నిముషాలు మగ్గించి ఉప్పు, వేరుశనగ పొడి మిశ్రమం కలిపి మరో రెండు నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.