రాజ్మా - 200 గ్రా.
జీలకర్ర - అరటీస్పూన్
ఉల్లిపాయలు - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
టొమాటో గుజ్జు - కప్పు
పచ్చిమిర్చి - 4
జీలకర్ర పొడి - టీస్పూన్
ధనియాల పొడి - అరటీస్పూన్
కారం - టీస్పూన్
ఉప్పు - సరిపడా
పెరుగు - పావుకప్పు
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
నూనె - తగినంత
తయారుచేసే పద్ధతి :
- రాజ్మా శుభ్రముగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. కుక్కర్ లో ఉడికించుకోవాలి.
- బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత టొమాటో గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పెరుగు, ఉప్పు ఒక దాని తర్వాత ఒకటి వేసి ఐదారు నిముషాలు ఉడికించుకోవాలి.
- ఉడికించిన రాజ్మా వేసి కలిపి అరకప్పు నీళ్ళు పోసి 20 నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుముతో అలంకరిస్తే సరి..
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం