కాలీఫ్లవర్ - కిలో
నూనె - తగినంత
బంగాళాదుంపలు - అరకిలో
బఠానీ - అరకిలో
ఉల్లిపాయలు - ఐదు (ఒకటి చిన్న ముక్కలుగా కోయాలి, మిగిలినవి సన్నగా పొడుగ్గా కోయాలి)
కుంకుమ పువ్వు - అరటీస్పూన్
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
మసాలా ముద్ద కోసం :
అల్లం - అంగుళం ముక్క
లవంగాలు - 12
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
కాశ్మీరి మిర్చి - 16
తయారుచేసే పద్ధతి :
కాలీఫ్లవర్ పూరేమ్మల్ని విడదీయాలి. బంగాళాదుంపలు పెద్ద ముక్కలుగా కోయాలి.
మసాలా ముద్ద కోసం తీసుకున్నవన్ని మెత్తగా నూరాలి. బాణలిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి పొడవుగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని ముద్దలా చేసి ఉంచాలి. ఇప్పుడు ఆ నూనెలోనే సన్నని ముక్కలుగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత మసాలా ముద్ద వేసి మూడు నాలుగు నిముషాలు వేయించాలి.
కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బఠానీలు వేసి మూడు కప్పుల నీలు పోసి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికాక ఉల్లిముద్ద వేసి ఉప్పు వేసి ఉడికించాలి.
చివరగా పెరుగులో కుంకుమ పువ్వు వేసి కలిపి, మృదువుగా చేయాలి. ఇప్పుడు ఇది కూరలో వేసి ఓ నిమిషం ఉడికించి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం