క్యారెట్ - ఒకటి
క్యాప్సికం - ఒకటి
బంగాళాదుంప - ఒకటి
క్యాలిఫ్లవర్ - కొద్దిగా
బీన్స్ - పది
బఠానీలు - అరకప్పు
ఉల్లిపాయలు - రెండు
టొమాటోలు - రెండు
కొత్తిమీర తురుము- పావుకప్పు
కరివేపాకు - ఒక రెమ్మ
గరం మసాలా - టేబుల్ స్పూన్
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
మసాలా ముద్ద కోసం :
కొబ్బరి తురుము - అరకప్పు
వెల్లుల్లి - 12
అల్లం - చిన్న ముక్క
ఎండుమిర్చి - 6
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీస్పూన్
గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్ధతి:
ముందుగా మసాలా ముద్ద కోసం తీసుకున్నవన్నీ ముందు వేయించి చల్లారాక నీళ్ళు చల్లి ముద్ద చేయాలి.
కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి. వీటిలో తగినన్ని నీళ్ళు పోసి, ఉప్పు వేసి సగం ఉడికే వరకు ఉంచి దించాలి. తర్వాత నీళ్ళు వంపేసి ఉంచాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. టొమాటోలు గుజ్జుగా చేయాలి.
బాణలిలో నూనె వేసి కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి మారేవరకు వేయించాలి. తరువాత మసాలా ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన కూరగాయ ముక్కలు, టొమాటో గుజ్జు వేసి కలపాలి. తరువాత రెండు కప్పుల నీళ్ళు పోసి సిమ్ లో ఉడికించాలి. తరువాత గరం మసాలా చల్లి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం