శెనగపప్పు - 150 గ్రా.
ఉల్లిపాయలు - 100 గ్రా.
టమోటాలు - 150 గ్రా.
పచ్చిమిరపకాయలు - 3
పచ్చి కొబ్బరి - 4 చిన్న ముక్కలు
సోంపు - ఒక టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
చింతపండు - 50 గ్రా.
నూనె - 100 గ్రా.
కారం పొడి - 100 గ్రా.
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
పోపు గింజలు - అరటీస్పూన్
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- మొదట శెనగపప్పును అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. మరో వైపు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
- స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత పోపు గింజలు వేసి చిటపటలాడక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అనంతరం టమోటా ముక్కలు వేసి కలుపుకొని, వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి వేసి కలిపి సన్నని మంట మీద రెండు నిముషాలు ఉడికించాలి.
- ఈలోపు ఒక చిన్న పాత్రలో చింతపండు తీసుకొని, అందులో గ్లాస్ నీళ్ళు పోసి, పులుసు తీసుకొని బాణలిలో పోయాలి. తర్వాత తగినంత ఉప్పు చేర్చి పెద్ద మంట మీద పది నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
- మరో వైపు నానబెట్టిన శెనగపప్పు మిక్సీలో వేసి, అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పును చేర్చి, కాసిన్ని నీళ్ళు పోసి (ఉండలు వచ్చేటట్లుగా) రుబ్బుకోవాలి. ఇప్పుడు శెనగ పిండి మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో ఉండలుగా చేసుకొని, బాణలిలో ఉడుకుతున్న పులుసులో వేయాలి. చివరగా పచ్చి కొబ్బరిని రుబ్బి, పులుసులో కల్పి మరో ఐదు నిముషాలు ఉడికించాలి. అంతే పుల్లపుల్లటి శెనగపప్పు ఉండల పులుసు రెడీ. ఇది అన్నం, దోసె, ఇడ్లిలో సైడ్ డిష్ గా ఆరగించవచ్చు.
మూలం : సాక్షి దినపత్రిక