పన్నీర్ ముక్కలు - కప్పు
చిలగడ దుంపలు - అరకప్పు (ఉడికించి తురుముకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచ
గరం మసాలా - అర చెంచ
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొంచెం
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు
టొమాటో ముక్కలు - పావు కప్పు
పచ్చి బఠానీ - పావు కప్పు
కారం - రెండు స్పూన్లు
జీడిపప్పు - కొన్ని
తయారుచేసే పద్ధతి :
- చిలగడ దుంపలు, పన్నీర్ ను ఒకే సైజ్ లో ముక్కల్లా చేసుకోవాలి.
- పన్నీర్ ముక్కలని టేబుల్ స్పూన్ నూనెలో దోరగా వేయించుకొని తీసుకోవాలి.
- మిగిలిన నూనెను బాణలిలో వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కల్ని వేయాలి. అవి కొద్దిగా మెత్తగా అయ్యాక చిలగడ దుంప ముక్కలూ, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. నీళ్ళు మరుగుతున్నపుడు పచ్చి బఠానీ వేసి మళ్లీ మూత పెట్టేయాలి. అవి ఉడికాక పన్నీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. రెండు లేక మూడు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి, జీడిపప్పుతో అలంకరించుకుంటే చపాతీలు, పూరీలూ, ఇతర రోటీల్లోకి కూర సిద్దం.
మూలం : ఈనాడు వసుంధర