అరటి కాయలు - రెండు
చిన్న ఉల్లిపాయలు - 15
టొమాటోలు - రెండు
చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి ఉంచాలి)
వెల్లుల్లి రెబ్బలు - 12
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 4 టీస్పూన్లు
జీలకర్ర - టీస్పూన్
మెంతులు - పావుటీస్పూన్
ఆవాలు - టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - సరిపడా
తయారుచేసే పద్ధతి :
- అరటికాయలు చెక్కు తీసి ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి.
- ఫ్రెషర్ పాన్ లో నూనె వేసి మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఒలిచిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జు, అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పదిహేను నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కూర దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం