కందిపప్పు - ఒకటిన్నర కప్పు
ఎరుపు రాజ్మా గింజలు - నాలుగు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - నాలుగు (సన్నగా తరిగినవి )
అల్లం తరుగు - ఒక టీస్పూన్
వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
పెద్ద ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగాలి)
టొమాటోలు - మూడు (సన్నగా తరిగాలి)
పెరుగు - అరకప్పు
తాజా మీగడ - అర కప్పు
కారం - అర టీస్పూన్
పసుపు - కొద్దిగా
ధనియాల పొడి - ఒక టీస్పూన్
గరం మసాలా పొడి - ఒక టీస్పూన్
ఆమ్‌చూర్ పొడి - అర టీస్పూన్
బటర్ - రెండు టేబుల్ స్పూన్‌లు
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగాలి)
ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేసే పద్ధతి :
- రాజ్మా గింజల్ని రాత్రంతా నీళ్లలో నానపెట్టాలి.
- రాజ్మా, కందిపప్పుల్ని కలిపి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కుక్కర్‌లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి మళ్లీ పావుగంట సేపు ఉడికించి అందులో పెరుగు కలపాలి.
- లోతైన గిన్నెలో బటర్ వేసి, కాగాక జీలకర్ర వేయాలి. అది వేగాక అల్లం, వెల్లుల్లి వేసి కొన్ని సెకన్ల తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేగించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి కలిపి ఉప్పు, మసాలా దినుసులు వేయాలి. ఇందులో ఉడికించిన పప్పుల్ని వేసి మంట మరీ ఎక్కువ, తక్కువ కాకుండా కొద్దిసేపు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి పైన కొత్తిమీర తరుగుని వేసి ఆపైన మీగడ వేయాలి. దీన్ని వేడివేడి లచ్చా పరాటా, నాన్ లేదా అన్నంతో తింటే బాగుంటుంది.
మూలం : సూర్య దినపత్రిక