వంకాయలు - పావు కిలో
చిక్కుడు గింజలు - పావు కప్పు
పసుపు - చిటికెడు;
జీలకర్రపొడి, కారం - పావు టీ స్పూను చొప్పున
ధనియాలపొడి - టీ స్పూను;
నూనె - ఒకటిన్నర టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లిపేస్ట్ - టీ స్పూను;
కొత్తిమీర - చిన్నకట్ట
పచ్చిమిర్చి - 3;
జీలకర్ర - అర టీ స్పూను;
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
- చిక్కుడు గింజలకు కొద్దిగా నీరు, ఉప్పు జతచేసి ఉడికించాలి.
- బాణలిలో నూనె కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి నాలుగైదు నిముషాలు వేయించాక, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి.
- వంకాయముక్కలు, కొద్దిగా నీరు వేసి బాగా కలిపి, సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాక, చిక్కుడు గింజలు జత చేసి, మరో ఐదు నిముషాలు ఉంచి, దించేయాలి.