తాజా చిక్కుడుగింజలు - కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు;
పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
పల్లీలు - కొద్దిగా;
ధనియాలు - టీ స్పూను
ఎండుకొబ్బరి - చిన్నముక్క;
వెల్లుల్లి రేకలు - 3
ఉప్పు - తగినంత;
ఆవాలు - అర టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను
కొత్తిమీర - చిన్న కట్ట;
నూనె - 2 టీ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
- చిక్కుడుగింజలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్లో ఉడికించాలి.
- పల్లీలు, ధనియాలు వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి చేయాలి.
- ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి.
- కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
- చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర చల్లాలి.