రాజ్మా - రెండు కప్పులు
రిఫైన్డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను;
ఉల్లితరుగు - కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను;
పసుపు - కొద్దిగా
టొమాటో ముక్కలు - కప్పు;
ఉప్పు - తగినంత
గరంమసాలా - టీ స్పూను;
ఇంగువ - చిటికెడు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
ధనియాలపొడి, జీలకర్రపొడి - 2 టీ స్పూన్ల చొప్పున
కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారి:
- బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి.
- ఉల్లితరుగు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి.
- అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించాలి.
- పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా పొడి వేసి నూనె వేరు పడేవరకు వేయించాలి
- రాజ్మా, మూడు కప్పుల నీరు, ఇంగువ, ఉప్పు వేసి సుమారు 10 నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి
- (కొన్ని రాజ్మా గింజలను మెత్తగా చేసి జత చేస్తే గ్రేవీలా ఉంటుంది)