బెండకాయలు-పావుకిలో
కొబ్బరితురుము-రెండున్నర టేబుల్‌స్పూన్లు
కొత్తిమీర తురుము-ఒక టేబుల్‌స్పూన్
రెడ్ క్యాప్సికమ్-ఒకటి, గ్రీన్ క్యాప్సికమ్-ఒకటి
టమాటాలు-రెండు
నెయ్యి-రెండు టేబుల్‌స్పూన్లు
అల్లం తురుము- ఒక టేబుల్‌స్పూన్లు
జీలకర్ర-అర టేబుల్‌స్పూన్
ఇంగువ-అర టేబుల్‌స్పూన్
పచ్చిమిర్చి ముద్ద-ఒక టేబుల్‌స్పూన్
ఎండు మామిడికాయపొడి-అర టేబుల్‌స్పూన్
ఉప్పు-సరిపడా, ధనియాలపొడి-అర టేబుల్‌స్పూన్
తయారుచేసే విధానం
బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి ముద్ద, అల్లం తురుము వేసి తిప్పాలి. తరువాత ముక్కలుగా కోసిన క్యాప్సికమ్, టమాట కూడా వేసి ఓ రెండు నిమిషాలు కలపాలి. ఇప్పుడు రెండు టేబుల్స్పూన్ల కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు తిప్పి రెండు చివరలా కోసేసిన బెండకాయల్ని అలాగే వేసి మూతపెట్టాలి. బెండకాయలు బాగా ఉడి కాయి అనుకున్న తరువాత మూత తీసేయాలి. తరువాత ఉప్పు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము, మామిడికాయపొడి, ధనియాలపొడి వేసి కలిపి మరికాసేపు వేగనిచ్చి దించాలి. దించే ముందు పక్కన ఉంచిన అరటేబుల్‌స్పూన్ కొబ్బరి తురుము చల్లితే బిండీ సాంబారియా రెడీ.