కంద - 250 గ్రా.
ఉల్లిపొరక - 500గ్రా.
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 టీస్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
వండండి ఇలా
- కందదుంపపై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఉల్లిపొరక కూడా శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో తెల్లని ఉల్లి భాగం విడిగా పెట్టుకోవాలి.
- పాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేపాలి.
- ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్దిగా వేపి కంద ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత కడిగిన ఉల్లిపొరక తరుగు వేసి కలిపి మూత పెట్టాలి.
- కొద్దిగా మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
- కూర ఉడికిన తర్వాత గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీలకు బావుంటుంది.