పాలకూర 2 కప్పులు,
మీల్ మేకర్ కీమా -1/2 కప్పు,
ఉల్లిపాయ 1,
పసుపు 1/ స్పూన్,
కారం పొడి స్పూన్,
ఉప్పు తగినంత,
గరం మసాలా పొడి -1/ స్పూన్,
కరివేపాకు -2 రెబ్బలు,
అల్లం ముద్ద -1 స్పూన్,
నెయ్యి -1 స్పూన్,
నూనె -3 స్పూన్
తయారు చేసేవిధానం :
- మీల్మేకర్ని వేడి నీళ్లలో వేసి పదినిమిషాలపాటు ఉంచాలి. తర్వాత నీరంతా పిండేసి పాన్లో నెయ్యి వేసి వేడయ్యాక మీల్మేకర్ వేసి కొద్దిగా వేయించాలి. దీనివల్ల మీల్మేకర్కు మంచి వాసన వస్తుంది.
- పాలకూర కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
- తర్వాత పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేయించి తరిగిన పాలకూర, ఉప్పు, కారం పొడి వేసి కలిపి మూతపెట్టాలి.
- చిన్నమంట మీద పాలకూర మొత్తం ఉడికేవరకు ఉంచి వేయించుకున్న మీల్ మేకర్, గరం మసాలా పొడి వేసి బాగా కలియబెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ కూర అన్నం, రొట్టెల్లోకి బాగుంటుంది.