పనీర్ 250 గ్రాములు,
ఉడికించిన పచ్చి బఠాణీలు రెండు కప్పులు
మీగడ పావు కప్పు ,
పెరుగు అర కప్పు
ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్,
ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్,
ఆవాల పొడి 1/2 టీస్పూన్,
కారం 1/2 టీ స్పూన్,
కొత్తి మీర , పసుపు, ఉప్పు , గరం మసాల పొడి , తగినంత నూనె,
తయారు చేసే విధానం :
పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. ధనియాల పొడి, కారం పొడి, ఆవపొడి, పసుపు,ఉప్పు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి. ఇందులో పెరుగు పోసి ఒక నిమిషం పాటు కలపాలి. తర్వాత మీగడ , తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఉడక బెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి బాణలిపై మూత పెట్టాలి. ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దానిని వేరొక గిన్నెలో వేసి గరం మసాల పొడి వేసి కొత్తిమీరతో అలంకరించాలి. మటర్ పనీర్ రెడీ. అన్నంతో, చపాతితో తింటే చాలా రుచిగా ఉంటుంది.