పాలకూర - ఒక కట్ట
జీడిపప్పు పలుకులు - ఒక టేబుల్ స్పూన్
మిరపకాయ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
ఉడికించిన మొక్కజొన్నలు - మూడు టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయ ముక్కలు - ఒక టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - కొద్దిగా
పెరుగు - ఒక టేబుల్ స్పూన్
పాలు - అరకప్పు
కసూరి మేతి - ఒక టీస్పూన్
గరం మసాలా - ఒక టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
ముందుగా పాలకూరను పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, మిరపకాయ కూడా దంచుకోవాలి. మూకుడు వేడి చేసి ఉల్లిపాయల్ని వేయించాలి. దానికి ఉడికించిన కార్న్, పచ్చిమిరపకాయ, అల్లం,వెల్లుల్లి పేస్ట్ కలపాలి. పెరుగు, పాలు, జీడిపప్పు పేస్ట్ కలిపి కొద్ది నిముషాలు ఉడికించాలి. పాలకూర పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలపెట్టాలి. పరోటాలకు, అన్నానికి మంచి కాంబినేషన్.
మూలం : స్వాతి సపరివార పత్రిక