మిరపకాయలు – 250 గ్రాములు
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు – 1/4 టీస్పూన్
కారం పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
మెంతి పొడి – 1/4 టీస్పూన్
పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్
నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
జీలకర్ర – 1/4 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
మెంతులు – చిటికెడు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
- ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం తగ్గుతుంది.
- ప్యాన్‌లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు వేయించాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి, నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి.
- ఇందాక మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా మరిగించాలి.
- పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన మిరపకాయలు, గరం మసాలా పొడి వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె తేలగానే దింపేయాలి.
- కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన్ తయారైంది. ఈజీగా ఉంది కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా బావుంటుంది.