బంగాళాదుంపలు - 4
పచ్చిమిర్చి తురుము - టేబుల్ స్పూన్
పాలకూర - 4 కట్టలు (చిన్నవి)
చాట్ మసాలా - టీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం తురుము - టీస్పూన్
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి బఠానీలు - ముప్పావు కప్పు
తయారుచేసే పద్ధతి :
- బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెదపాలి.
- బఠానీలు కూడా ఉడికించి మెదపాలి. పాలకూరని ఉప్పు వేసి వేడి నీళ్ళలో వేసి తీసి సన్నగా తరగాలి.
- ఉడికించిన బంగాళాదుంపలు,బఠానీలు, పాలకూరను అన్ని బాగా కలపాలి.అందులోనే అల్లం తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు , పచ్చిమిర్చి తురుము చాట్ మసాలా వేసి కలపాలి. అందులోనే కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలపాలి.
- మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి అరచేతిలోనే గుండ్రని పట్టీల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం