పన్నీర్ తురుము - పావుకప్పు
బంగాళాదుంపలు - 6(మీడియం సైజ్)
కారం - అరటేబుల్ స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - 6
నూనె - వేయించడానికి సరిపడా
జీడిపప్పు - 8
కొత్తిమీర తురుము - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. తరువాత అందులో ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న ఉండల్లా చేయాలి.
- ఉల్లిపాయనీ, వెల్లుల్లినీ సన్నగా తరగాలి. జీడిపప్పుని మెత్తగా దంచాలి. తరువాత వీటిలోనే తరిగిన ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బంగాళదుంప ముద్ద మధ్యలో పెట్టి గుండ్రని బిళ్ళల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం