పన్నీర్ - పావుకిలో
సెనగ పిండి - కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అరటీస్పూన్
మంచి నీళ్ళు - అరకప్పు
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి:
- సెనగ పిండిలో ఉప్పు, కారం వేసి, కాసిని నీళ్ళు పోసి చిక్కగా కలిపి పక్కన పెట్టాలి.
- పన్నీర్ ను కావలసిన సైజ్ లో ముక్కలుగా కోయాలి.
- ఇప్పుడు పన్నీర్ ముక్కలను సెనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చాక తీయాలి. వీటిని బ్లాటింగ్ పేపర్ మీద వేసి నూనె అద్ది పూదీన చట్నీ తో తింటే చాలా బాగుంటుంది.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం