బ్రెడ్ స్లైస్ స్ - 1 ప్యాకెట్
క్యారెట్ - 100 గ్రా.
బటాణి - 100 గ్రా.
పచ్చిమిర్చి - ఐదు
కొత్తిమీర - రెండు కాడలు
నెయ్యి - 50 గ్రా.
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
ముందుగా క్యారెట్, పచ్చిమిర్చి, బటాణిలను మిక్సిలో వేసి నీటిని కలిపి ముద్దగా చేయాలి. బ్రెడ్ స్లైస్ స్ కు కొంచెం నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను క్యారెట్, పచ్చిమిర్చి, బటాణి మిశ్రమం తో కలిపి చిన్న ఉండలుగా చేయాలి. తర్వాత ఉండలను చేతిలో అట్లువలే తట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి కొంచెం వేసి కాగిన తర్వాత ఒక్కొక్క అట్టును కోడి గుడ్డు సొనలొ ముంచి పెనం ఫై వేసి గోధుమ రంగుకు వచ్చేవరకు వేయించాలి. అంతే వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.. సాయంత్రం వీటిని స్నాక్స్ గా కూడా ఆరగించవచ్చు.
మూలం : సాక్షి దినపత్రిక