బ్రెడ్ స్లైసెస్ - ఆరు
వెన్న - రెండు చెంచాలు
ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికం - ఒక్కొక్కటి చొప్పున
చీజ్ తురుము - అరకప్పు
టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్ - పావు కప్పు
ఉప్పు, మిరియాల పొడి - తగినంత
తయారుచేసే పద్ధతి :
- ముందుగా ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమును సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా వెన్న రాసి దానిపైన టొమాటో కెచప్ లేదా పిజ్జా సాస్ ను టాపింగ్ లా రాయాలి. పైన తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పరిచి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. దానిపైన తగినంత చీజ్ ను పరవాలి. ఇలా మిగిలిన స్లైసులను కూడా చేయాలి.
- వీటన్నింటిని ఓవెన్ లో మూడు లేక నాలుగు నిముషాలు బేక్ చేస్తే సరిపోతుంది. పైన కావాలనుకుంటే మరికాస్త మిరియాల పొడి చల్లుకోవచ్చు. ఈ పిజ్జా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది.
మూలం : ఈనాడు వసుంధర