ఉడికించిన గుడ్లు - నాలుగు,
శెనగపిండి - రెండు టీస్పూన్లు,
చిన్న ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి),
తెల్లసొన - ఒక గుడ్డు,
పుదీనా, కొత్తిమీర తరుగు - ఒక్కో టేబుల్ స్పూన్,
పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి),
కారం - పావు టీస్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - వేగించడానికి సరిపడా.
తయారీ:
పెంకు తీసి గుడ్లను తురమాలి. ఈ తురుములో నూనె మినహాయించి మిగతా పదార్థాలన్నింటినీ వేసి కలిపి ముద్దలా చేయాలి. ఈ ముద్ద నుంచి పన్నెండు ఉండలు చేయాలి. ఒక్కో ఉండను ఒత్తి గుండ్రటి కట్‌లెట్‌ల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేడిచేసి తయారుచేసుకున్న కట్‌లెట్‌లను ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి. కరకరలాడే ఈ కట్‌లెట్‌ల పైన సన్నగా, చక్రాల్లా కోసుకున్న ఉల్లిపాయల్ని అలంకరించి, పుదీనా చట్నీతో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.