అన్నం - 2 కప్పులు
శనగపిండి - అరకప్పు
జీలకర్ర - పావు టీ స్పూన్
ఉల్లిగడ్డ - 1
కారం - ఒక టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉండేట్లుగా చూడాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగాక పిండిని ముద్దలుగా చేసి నూనెలో వేసి వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. హాట్.. హాట్‌గా రైస్ పకోడీలు లాగించేస్తే బాగుంటాయి.
మూలం : నమస్తే తెలంగాణ దినపత్రిక