బియ్యం పిండి - అరకిలో
ఉప్పు - తగినంత
పచ్చిమిరపకాయలు - రుచికి తగినన్ని (నూరినవి)
వెన్న - కావాలనుకుంటే
పచ్చి శనగ పప్పు - ఒక టేబుల్ స్పూన్ (నానబెట్టినవి)
నూనె - వేయించడానికి తగినంత
కరివేపాకు - ఒక కట్ట (తరిగినది)
తయారు చేసే విధానం:
- బియ్యపు పిండి, ఉప్పు, నూరిన పచ్చి మిరపకాయలు, వెన్న, శనగపప్పు, కరివేపాకు అన్నింటినీ తగినంత నీళ్ళు వేసి కలపాలి. పిండి గట్టిగా ఉండాలి తప్ప జారుగా కాకూడదు. తర్వాత పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి.
- తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక పాలిథిన్ కవర్‌పై కాస్త నూనె రాసి చెక్కలను చేతులతో వత్తాలి.
- పొయ్యి మీద బాణలిలో తగినంత నూనె పోసి చెక్కలను ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి నెలరోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి.
మూలం : సూర్య దినపత్రిక