మైదా - 1 కప్పు
డాల్డా - 2 టీస్పూన్
ఉప్పు - చిటికెడు
చాకోస్ - 1/4 కప్పు
చాక్లెట్ బార్ - 1
బాదాం - 5
జీడిపప్పు - 6
పిస్తా - 5
నూనె - వేయించడానికి
ఒక గిన్నెలో చాకోస్, సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, పిస్తా ముక్కలు తీసుకుని చాక్లెట్ తురిమి వేయాలి. ఇదంతా కలిపి ఉంచుకోవాలి. మైదాలో కరిగించిన డాల్డా, చిటికెడు ఉప్పు వేసి కలిపి అవసరమైనన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి. అరగంట తర్వాత తీసి కాస్త నూనె రాసుకుని బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడి పిండి చల్లుకుంటూ పల్చగా, చిన్న పూరీలా వత్తుకోవాలి. మధ్యలో చెంచాడు చాక్లెట్, నట్స్ మిశ్రమం పెట్టి నాలుగు వైపులనుండి మూసేయాలి. అంచులు విడిపోకుండా గట్టిగా వత్తిపెట్టాలి. వీటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీయాలి. వీటిని ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. పిల్లలు అలాంటివి ఇష్టపడకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి.