నూడుల్స్ - 200 gms
నూనె - 2 టేబిల్ స్పూన్స్
వెల్లుల్లి - 5
ఉల్లిపాయ - 1
క్యాబేజీ తరుగు - 2 కప్పులు
క్యారట్ తరుగు - 1 కప్పు
కాప్సికమ్ తరుగు - 1/2 కప్పు
బీన్స్ తరుగు - 1/4 కప్పు
అజినొమొటొ - చిటికెడు
టమాటా కెచప్ - 4 టేబిల్ స్పూన్స్
సోయా సాస్ - 1 టేబిల్ స్పూన్
వెనిగర్ - 1 టేబిల్ స్పూన్
పంచదార - 2 టేబిల్ స్పూన్స్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1/2 టేబిల్ స్పూన్
కార్న్‌ఫ్లోర్ - 2 టేబిల్ స్పూన్స్
ఒక గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు మరిగించి నూడుల్స్ వేయాలి. అవి సగం ఉడికిన తర్వాత తీసి జల్లెట్లో వేయాలి. నీరంతా పోయాక పల్చటి బట్ట లేదా పేపర్ మీద వెడల్పుగా వేయాలి. నూడుల్స్ పూర్తిగా ఆరిన తర్వాత బాణలిలో నూనె వేడి చేసి క్రిస్పీగా అయ్యేవరకు వేయించి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని కాస్త చేత్తో నలిపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, పంచదార, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి రెండు కప్పుల నీళ్లు, కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్ లేదా బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి కొద్ది సేపు వేయించాలి. ఇందులో తరిగిన క్యాబేజీ, క్యారట్, కాప్సికమ్, బీన్స్, వేసి మరి కొద్దిసేపు వేయించి అజినొమొటొ వేసి కలపాలి. ఇందులో సాస్ మిశ్రమం వేసి ఉడికించి వేయించి పెట్టుకున్న నూడుల్స్ సగం వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత దింపేసి మిగిలిన నూడుల్స్ వేసి సర్వ్ చేయాలి.