మీల్మేకర్ - 10ఱగా,
కార్న్ ఫ్లోర్ - 1/2 కప్పు,
బియ్యప్పిండి - 1/2 కప్పు,
శనగపిండి - 1/2 కప్పు,
ఉల్లిపాయలు - 2,
నిమ్మకాయ - 1,
కొత్తిమీర - 1 కట్ట,
కరివేపాకు - కొద్దిగా,
నూనె - సరిపడ,
ఉప్పు, కారం - తగినంత,
అల్లం పేస్ట్ - 2 స్పూన్లు
తయారు చేసేవిధానం :
- ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. మరిగించిన నీళ్లలో మీల్మేకర్ వేసి పక్కన పెట్టుకోవాలి.
- 10 నిమిషాల తరువాత నీళ్లలోంచి మీల్‌మేకర్‌ని తీసి వేరే పాత్రలో మెత్తగా చేయాలి.
- మెత్తగా చేసిన మీల్మేకర్లో కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
- కడాయిలో నూనె కాగిన తరువాత పకోడీలు వేసుకోవాలి. అంతే కర కరలాడే మీల్మేకర్ పకోడీ రెడీ. ఇందులోకి టొమేటో సాస్ చాలా బాగుంటుంది!