శనగపిండి : కప్పు,
బియ్యప్పిండి : 2 స్పూన్లు,
పనీర్ : 200 గ్రాములు,
జీలకర్ర : స్పూన్,
పచ్చిమిర్చి : 3-4,
అల్లం తరుగు : 2స్పూన్,
ఉల్లితరుగు : 1/2కప్పు,
కొత్తిమీర : ఒక కట్ట,
పుదీనా : ఒక కట్ట,
ఉప్పు, కారం, నూనె : తగినంత.
తయారు చేయు విధానం :
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు కూడా వేయాలి. ఇవి వేగాక కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మరో నిమిషం వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చే స్తే గ్రీన్ చట్నీ తయారయినట్టు. దీనిని పక్కనుంచుకోవాలి. తర్వాత పనీర్‌ను చిన్న చిన్న స్లైసెస్‌గా చేసుకుని, మధ్యలో ఈ గ్రీన్ చట్నీ పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, నీరు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా స్టఫ్ చేసిన పనీర్ ముక్కలను శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే బాగుంటాయి.