టమోటాలు : నాలుగు
బంగాళ దుంపలు : రెండు
ఉల్లిపాయ : ఒకటి,
కరివేపాకు : ఒక రెబ్బ
ఆవాలు, జీలకర్ర : ఒక టీ స్పూను
కారం : రెండు టీ స్పూన్లు
పచ్చిమిరపకాయలు : రెండు
పసుపు : చిటికెడు
శెనగపిండి : రెండు టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పిండి : రెండు టేబుల్ స్పూన్లు
వరి పిండి : ఒక టేబుల్ స్పూను
ఉప్పు : తగినంత
వంట సోడా : చిటికెడు
నూనె : సరిపడా
తయారు చేయు విధానం:
ముందుగా బంగాళా దుంపలతో కూర వండి పెట్టుకోవాలి. తర్వాత టమోటాల్ని శుభ్రంగా కడిగి మధ్యలో గాటు పెట్టి గుజ్జంతా తీసేయాలి. అందులో బంగాళ దుంప కూర పెట్టి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో శెనగపిండి, వరిపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, సోడా, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఇందులో ఆలు కూర కూర్చిన టమోటాల్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి వేగించి తీసేయాలి.