కాలీఫ్లవర్ - 1,
మిరియాల పొడి - 2 స్పూన్స్,
శనగపిండి - 4 స్పూన్స్,
కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు,
జీలకర్ర - ఒక టీ స్పూన్ ,
ఇంగువ - అర టీ స్పూన్,
పసుపు - ఒక టీ స్పూన్,
కారం - ఒక టీ స్పూన్,
కొత్తిమీర - ఒక కట్ట,
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
- కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి.
- పచ్చిమిరపకాయలను, వెల్లుల్లిపాయలను మిక్సీ చేయాలి. దీన్ని కాలీఫ్లవర్‌లో కలుపుకోవాలి.
- దీంట్లో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కో ముక్కను నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. వేడి.. వేడి పకోడీ మీ ముందుంటుంది.