telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

కోఫ్తా కర్రీ 

6/15/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
సొరకాయ       -        పావుకేజీ 
మొక్కజొన్న పిండి -  మూడు టేబుల్ స్పూన్లు 
బ్రెడ్ స్లైసులు    -        మూడు 
ఉల్లిపాయలు    -        మూడు 
టొమాటోలు     -        రెండు 
అల్లం              -        చిన్న ముక్క 
వెల్లుల్లి రెబ్బలు -        ఐదారు 
జీడిపప్పు        -        ఎనిమిది 
వెన్న             -         అరకప్పు 
పసుపు          -         అరచెంచ 
ఉప్పు            -         తగినంత 
కారం             -          రెండు చెంచాలు 
ధనియాల పొడి -         రెండు చెంచాలు 
నూనె            -          వేయించడానికి సరిపడా 
జీలకర్ర          -          కొద్దిగా 
కొత్తిమీర తరుగు -       పావుకప్పు 

తయారుచేసే పద్ధతి :
  • సొరకాయ చెక్కు తీసి తురుమి గట్టిగా పిండేస్తే అందులోని నీరు పోతుంది. అందులో మొక్కజొన్న పిండి, బ్రెడ్ పొడి, తగినంత ఉప్పు, చెంచ కారం, సగం కొత్తిమీర తరుగు వేసుకొని గట్టి పిండిలా కలుపుకోవాలి. 
  • ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని ఉండల్లా చేసుకొని అందులో వేసి ఎర్రగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి.
  •  ఉల్లిపాయ, టొమాటోలను ముక్కల్లా కోసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. 
  • ఈ మిశ్రమాన్ని ఐదారు చెంచాల నూనెలో వేసి బాగా ఉడకనివ్వాలి. కాసేపయ్యాక మిగిలిన కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర తరుగు, మరికొంచెం ఉప్పు, వెన్న వేసి బాగా కలపాలి. ఒకవేళ గ్రేవీ మరీ గట్టిగా ఉందనుకుంటే కాసిని నీళ్ళు కలుపుకోవచ్చు. ఐదారు నిమిషాలయ్యాక దీన్ని దింపేసి ముందుగా వేయించుకున్న ఉండాలని వేస్తే సరిపోతుంది. ఇది ఫ్రైడ్ రైస్ లోకి, రొట్టేల్లోకి బాగుంటుంది.

మూలం : ఈనాడు వసుంధర 

0 Comments

సొరకాయ పల్లీల కూర 

6/14/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
సొరకాయ ముక్కలు - రెండు కప్పులు
వేయించిన పల్లీలు    - పావు కప్పు
కారం                    -  చెంచ
వెల్లుల్లి రెబ్బలు       -  రెండు
ఉల్లిపాయ              - ఒకటి
ఉప్పు                   - తగినంత
కరివేపాకు              - రెండు రెమ్మలు
నూనె                   -  రెండు లేక మూడు చెంచాలు
పసుపు                - చిటికెడు
ఆవాలు                -  అరచెంచ
                  మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర - అన్నీ కలిపి రెండు చెంచాలు

తయారుచేసే పద్ధతి :
  • సొరకాయ ముక్కల్లో చాలా కొద్దిగా నీళ్ళు పోసి ఒక కూత వచ్చేవరకూ కుక్కర్ లో ఉడికించుకోవాలి. ఆ ముక్కలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి తాలింపు గింజల్ని వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి, రెండు లేక మూడు నిముషాలు వేగనివ్వాలి.
  • వేయించుకున్న పల్లీలు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడిచేసుకోవాలి.
  • కూరముక్కలోని తడిపోయాక ఈ పొడిని వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే సరిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, రొట్టేల్లోకి కూడా చాలా బాగుంటుంది.

మూలం : ఈనాడు వసుంధర

0 Comments

పన్నీర్ దో ప్యాజా 

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్       -           100 గ్రా. 
గరం మసాలా  -        టీస్పూన్ 
జీడిపప్పు     -         20 గ్రా.(పొడి చేయాలి)
ఉల్లితరుగు    -          పావుకప్పు 
టొమాటో తరుగు -      పావుకప్పు 
తర్బూజ గింజల పేస్ట్ - 20 గ్రా.
అజినమెటో   -          అరటీస్పూన్ 
బటర్           -          10 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ -     50 గ్రా.
పసుపు        -          కొద్దిగా 
నూనె           -         తగినంత 
ఉప్పు          -          తగినంత 
కారం           -          2 టీస్పూన్లు 
ఉల్లిపాయలు -          2 (పొరలుగా తీయాలి)

తయారుచేసే పద్ధతి :
  • పన్నీర్ ను కట్ చేసుకోవాలి
  • స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లితరుగు, కరివేపాకు జతచేసి వేయించాలి.  టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, 5 నిముషాలు ఉడికించాలి.
  • గరం మసాలా, అజినమెటో, తగినంత ఉప్పు వేసి కలపాలి. జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి.
  • ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

పన్నీర్ అంగా

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

పన్నీర్       -           100 గ్రా. 
గరం మసాలా  -        టీస్పూన్ 
ఉల్లిపాయలు     -       2 
టొమాటోలు     -      4 
క్యాప్సికం ముక్కలు -   కొద్దిగా 
తర్బూజ గింజలు   - 10 గ్రా.
అజినమెటో   -          అరటీస్పూన్ 
కొబ్బరి పొడి   -          2 టీస్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ -     100 గ్రా.
పసుపు        -          కొద్దిగా 
నూనె           -         తగినంత 
ఉప్పు          -          తగినంత 
కారం           -          2 టీస్పూన్లు 
జీడిపప్పు పొడి -        10 గ్రా.  
మిరియాలు   -           10 
ఎండు మిర్చి  -            10 

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా పన్నీర్, ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి, తర్బూజ గింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి.
  • స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
  • కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి 5 నిముషాలు ఉడికించాలి. 
  • ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నీరు పోసి రెండు లేక మూడు నిముషాలు ఉడికించి దించే ముందు కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి.
  • చివరగా మిరియాలు, ఎండు మిర్చి, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించి, క్యాప్సికం, టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

పన్నీర్ బేబీ కార్న్ 

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్       -           50 గ్రా.
బేబీ కార్న్   -           50 గ్రా.
గరం మసాలా  -        టీస్పూన్ 
జీడిపప్పు     -         గార్నిష్ కోసం 
ఉల్లితరుగు    -          పావుకప్పు 
టొమాటో తరుగు -      పావుకప్పు 
పుదీనా         -          అరకప్పు 
తర్బూజ గింజల పేస్ట్ - 20 గ్రా.
అజినమెటో   -          అరటీస్పూన్ 
బటర్           -          10 గ్రా.
అల్లం వెల్లుల్ పేస్ట్ -     50 గ్రా.
పసుపు        -          కొద్దిగా 
నూనె           -         తగినంత 
ఉప్పు          -          తగినంత 
కారం           -          2 టీస్పూన్లు 
జీడిపప్పు పొడి -        20 గ్రా.  

తయారుచేసే పద్ధతి :
  • పన్నీర్ ను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. బేబీ కార్న్ ను గుండ్రముగా తరగాలి. 
  • స్టవ్ మీద బాణలి ఉంచి మూడు టీస్పూన్ల నూనె వేసుకొని, కాగాక ముందుగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలను వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. 
  • వేరే బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగుని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి. తర్వాత గరం మసాలా, అజినమెటో, ఉప్పు వేసి కలపాలి. తర్వాత జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం, పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా కలపాలి. 

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

పన్నీర్ స్వీట్ కార్న్ మటర్

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్       -           100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి)
స్వీట్ కార్న్ గింజలు - 50 గ్రా.
బఠానీ         -          50 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ -      2 టీస్పూన్లు 
ఉల్లితరుగు    -          50 గ్రా.
టొమాటో ప్యూరి -       50 గ్రా.
పుదీనా         -          అరకప్పు 
జీడిపప్పు+తర్బూజ గింజల పేస్ట్ - రెండు టీస్పూన్లు 
పసుపు        -          కొద్దిగా 
నూనె           -         తగినంత 
ఉప్పు          -          తగినంత 
కొత్తిమీర       -          అరకప్పు    

తయారుచేసే పద్ధతి :
  • స్టవ్ మీద బాణలి ఉంచి అందులో మూడు స్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, గరం మసాలా వేసి వేయించాలి. 
  • జీడిపప్పు+తర్బూజ గింజల పేస్ట్ వేసి వేగాక పసుపు, పచ్చిమిర్చిపేస్ట్, పుదీనా, టొమాటో ప్యూరి వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
  • పన్నీర్, స్వీట్ కార్న్ గింజలు, బఠానీ వేసి ఉడికించి, అవి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లుకొని రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

పన్నీర్ 65

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్       -           100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి)
మైదా         -           20 గ్రా.
కార్న్ ఫ్లోర్   -           20 గ్రా.
అల్లం పేస్ట్    -          టీస్పూన్ 
కారం          -          టీస్పూన్ 
పసుపు       -          అరటీస్పూన్
గరం మసాలా -         టీస్పూన్ 
నూనె          -          వేయించడానికి సరిపడా
                                                                  ఉల్లి తరుగు   -          పావు కప్పు 
                                                                   ఉప్పు          -          తగినంత 
                                                                   కొత్తిమీర       -          కొద్దిగా    

తయారుచేసే పద్ధతి :
  • స్టవ్ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి వేగాక పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి.
  • ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి.
  • చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేయించాలి. 
  • తయారుచేసి ఉంచుకున్న పన్నీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

షక్కర్ కండి 

6/13/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్ ముక్కలు -          కప్పు 
చిలగడ దుంపలు  -           అరకప్పు (ఉడికించి తురుముకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ -           చెంచ 
గరం మసాలా      -           అర చెంచ 
ఉప్పు                -           తగినంత 
కొత్తిమీర              -          కొంచెం 
నూనె                 -            రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయ ముక్కలు -           పావుకప్పు 
టొమాటో ముక్కలు -            పావు కప్పు 
పచ్చి బఠానీ         -              పావు కప్పు 
కారం                  -              రెండు స్పూన్లు  
జీడిపప్పు            -              కొన్ని 


తయారుచేసే పద్ధతి :
  • చిలగడ దుంపలు, పన్నీర్ ను ఒకే సైజ్ లో ముక్కల్లా చేసుకోవాలి. 
  • పన్నీర్ ముక్కలని టేబుల్ స్పూన్ నూనెలో దోరగా వేయించుకొని తీసుకోవాలి. 
  • మిగిలిన నూనెను బాణలిలో వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కల్ని వేయాలి. అవి కొద్దిగా మెత్తగా అయ్యాక చిలగడ దుంప ముక్కలూ, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. నీళ్ళు మరుగుతున్నపుడు పచ్చి బఠానీ వేసి మళ్లీ మూత పెట్టేయాలి. అవి ఉడికాక పన్నీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. రెండు లేక మూడు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి, జీడిపప్పుతో అలంకరించుకుంటే చపాతీలు, పూరీలూ, ఇతర రోటీల్లోకి కూర సిద్దం.

మూలం : ఈనాడు వసుంధర  

0 Comments

దోసకాయ కూర

6/11/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
దోసకాయలు        -              250 గ్రా.
టమోటాలు           -             100 గ్రా.
ఉల్లిపాయలు          -             100 గ్రా.
అల్లం                   -            చిన్న ముక్క 
నూనె                   -            150 గ్రా.
ఆవాలు                 -            ఒక స్పూన్
జీలకర్ర                 -              ఒక స్పూన్
కరివేపాకు             -             కొంచెం 
పసుపు                -              ఒక స్పూన్
కారం పొడి            -               ఒకటిన్నర స్పూన్ 
ఉప్పు                  -              తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • మొదట దోసకాయలను, ఉల్లిపాయలను , టొమాటలను, అల్లంను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  • తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దోసకాయ, అల్లం ముక్కలను వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. అనంతరం టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, కారం పొడి, పసుపు వేసి ఐదు నిముషాలు నూనెలోనే ఉడకనివ్వాలి. చివరిగా కొంచెం నీటిని చేర్చి మరో రెండు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే దోసకాయ కూర రెడీ.

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

శెనగపప్పు  ఉండల పులుసు 

6/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
శెనగపప్పు          -           150 గ్రా.
ఉల్లిపాయలు        -            100 గ్రా.
టమోటాలు          -             150 గ్రా.
పచ్చిమిరపకాయలు -           3
పచ్చి కొబ్బరి        -             4 చిన్న ముక్కలు
సోంపు                -             ఒక టీస్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్ట్  -             ఒక టేబుల్ స్పూన్ 
చింతపండు          -            50 గ్రా.
నూనె                 -             100 గ్రా.
కారం పొడి           -              100 గ్రా.
కరివేపాకు           -               కొద్దిగా 
                                                                  కొత్తిమీర             -               కొద్దిగా 
                                                                 పోపు గింజలు      -               అరటీస్పూన్
                                                                  ఉప్పు                -               తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • మొదట శెనగపప్పును అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. మరో వైపు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. 
  • స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నూనె వేయాలి. నూనె బాగా కాగిన తర్వాత పోపు గింజలు వేసి చిటపటలాడక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అనంతరం టమోటా ముక్కలు వేసి కలుపుకొని, వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి వేసి కలిపి సన్నని మంట మీద రెండు నిముషాలు ఉడికించాలి. 
  • ఈలోపు ఒక చిన్న పాత్రలో చింతపండు తీసుకొని, అందులో గ్లాస్ నీళ్ళు పోసి, పులుసు తీసుకొని బాణలిలో పోయాలి. తర్వాత తగినంత ఉప్పు చేర్చి పెద్ద మంట మీద పది నిమిషాలపాటు ఉడకనివ్వాలి. 
  • మరో వైపు నానబెట్టిన శెనగపప్పు మిక్సీలో వేసి, అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పును చేర్చి, కాసిన్ని నీళ్ళు పోసి (ఉండలు వచ్చేటట్లుగా) రుబ్బుకోవాలి. ఇప్పుడు శెనగ పిండి మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో ఉండలుగా చేసుకొని, బాణలిలో ఉడుకుతున్న పులుసులో వేయాలి. చివరగా పచ్చి కొబ్బరిని రుబ్బి, పులుసులో కల్పి మరో ఐదు నిముషాలు ఉడికించాలి. అంతే పుల్లపుల్లటి శెనగపప్పు ఉండల పులుసు రెడీ. ఇది అన్నం, దోసె, ఇడ్లిలో సైడ్ డిష్ గా ఆరగించవచ్చు.


మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments
<<Previous
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    కంద
    ఆలూ గోబీ
    ఆలూ గోభీ
    మలై మటర్ పనీర్
    ఆలూ సోయా వేపుడు
    కడై పనీర్
    దహీ భేండీ
    ఆలూ కుర్మా
    మలై పన్నీర్
    ఆలు అమృత్‌సరి
    మలై కాలీఫ్లవర్
    సోయా
    బెండ
    సోయా - టొమాటో కర్రీ
    మునగ కూర
    దాల్ మఖని
    వెజ్ హలీం
    కుర్ కురీ భేండీ
    ములగ ఆకులు
    పాలక పనీర్
    గోడా మసాలా తయారీ
    టమాట పన్నీర్ కూర
    వంకాయ
    వంకాయ - చిక్కుడుగింజల కూర
    బెండి కా సాలన్
    సింధి కడి
    భేండీ భాజీ
    టమాటా బాజీ
    భేండీ మసాలా
    వంకాయ మసాలా
    బేసన్ బెండి
    టమాటా కుర్మా
    వంకాయ తొక్కు
    మటర్‌ పనీర్‌ కూర
    అచార్ పన్నీర్
    బఠానీ మష్రూమ్స్
    పాలక్ మీల్‌మేకర్
    బీరకాయ
    సొరకాయ
    పాఠోళి
    టొమాటో - ఎగ్ కర్రీ
    మిక్స్ డ్ వెజ్ కోకోనట్ కర్రీ
    మిర్చి కా సాలన్
    దోసకాయ కూర
    సుక్కి దాల్
    ఫ్రైడ్ టోపూ
    రాజ్మా రాస్ మిస్
    గ్రీన్ పీస్ మసాలా
    బీన్స్ మీల్ మేకర్ కూర
    రాజ్మా కర్రీ
    మిర్చి మసాలా
    బీరకాయ పల్లీ మసాలా
    సొరకాయ పల్లీల కూర
    బీరకాయ గసగసాలు
    గుత్తి పొట్లకాయ కూర
    టొమాటో గుత్తికూర
    బీరకాయ పెసరపప్పు కూర
    బ్రెడ్ మిక్స్‌డ్ వెజిటబుల్ బిర్యానీ
    పన్నీర్ దో ప్యాజా
    మునగాకు రసం
    పన్నీర్ అంగా
    రసవాంగి కూటు
    మునగాకు ఫ్రై
    పన్నీర్ బేబీ కార్న్
    కాకరకాయ మసాలా
    స్టఫ్డ్ భేండీ
    వజక్కయ్ కర్రీ
    చేమదుంప మసాలా
    మునగాకు పప్పు
    కొబ్బరి వేపుడు
    పన్నీర్ స్వీట్ కార్న్ మటర్
    మెంతాకు పన్నీర్
    పన్నీర్ మక్‌మలాయ్
    మొఘలాయీ కాలీఫ్లవర్
    పన్నీర్ క్యాప్సికం మసాలా
    కాప్సికం
    శనగపప్పు
    ఉసిరికాయ పప్పు
    బంగాళదుంప - మునగాకు ఫ్రై
    ఉల్లిపొరక కూర
    శెనగపప్పు ఉండల పులుసు
    కాలీఫ్లవర్
    వెల్లుల్లి కారం
    క్యాప్సికం కర్రీ
    చింతచిగురు దొండకాయ
    క్యాప్సికం పన్నీర్ కుర్మా
    బంగాళాదుంపలు
    చిక్కుడుగింజల కూర
    మొక్కజొన్నకుర్మా
    మొక్కజొన్నవేపుడు
    పన్నీర్ 65
    6b605723e1
    6d6af64986
    8c8cfd2e64
    8d0d675c9a
    90a7d6058e
    937f48c38a
    9640acb058
    Edd5508010
    Eeb66b27c8
    F20375deb0
    F4948ccbad
    Fdca5c53e4
    Fe39ccde14
    Fe7fa990a7
    Ff67fc0182
    Fffc315ddf

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.