ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మాలడీస్‌కు పులిట్జర్
తెరెకక్కిన తొలి నవల ద నేవ్గు సేక్
నక్సల్ బరి నేపథ్యంలో ది లోల్యాండ్గ
ఆలోచింపజేసే రచనలు ఆమె సొంతం
ఆమె రాసిన మూడు నవలలు ఓ సంచలనం. ఆమెకు లక్షల మంది అభిమానులు తెచ్చిపెట్టారుు. అరుుతే విమర్శకులు లేకపోలేదు. ఓ హెన్రీ, పులిట్జర్ అవార్డులు అందుకుని తన రచనా ఘనత ఏపాటిదో చూపించారు. తండ్రి భారతదేశాన్ని వీడిపోరుున తరువాత లండన్‌లో జన్మించింది ఈ రచరుుత్రి. అరుునా భారత దేశ సంసృ్కతి, సంప్రదాయాలు, సమస్యలు అన్నింటిపైన పట్టు సంపాదించింది. 1967లో పశ్చిమ బెంగాల్‌లో దున్నే వాడిదే భూమి పేరుతో ప్రారంభమైన ఉద్యమ నేపథ్యంలో రాసిన నవల ‘ది లోల్యాండ్గ’. ఇది ఈ సంవత్సరానికి బుకర్ పురస్కారం ఎంపిక జాబితాలో చోటు సంపాదించుకుంది.
ఝంపా లహరి
అసలు పేరు నీలాంజన సుధేష్ణ
జననం 11 జులై 1967
ప్రాంతం లండన్, ఇంగ్లాండ్
వృత్తి నవలా రచయిత
హాబీ షార్ట్ స్టోరీ సేకరణ
రచనలు ఇంటర్‌ప్రిటర్ ఆఫ్ మాలడీస్(1999)
ది నేమ్ సేక్(2003)
అన్‌అకస్టమెడ్ ఎర్త్(2008)
అవార్డులు ఓ.హెన్రీ(1999), పులిట్జర్(2000)
విదేశాల్లో ఉంటున్న భారతీయుల జీవనశైలిని, సాంస్కృతిక పరమైన గుర్తింపు వంటి అంశాలతో ఎంతో అద్భుతంగా రాస్తూ ఇటీవల ప్రముఖ రచయితల సరసన చేరిన యువ రచయిత్రి లహరి. ‘ది నేమ్‌సేక్’ ఆమె తొలి నవల. శరణార్ధుల జీవితాలను ఎంతో గొప్పగా వర్ణించింది. ఆమె పుస్తకాలు ఎందరు అభిమానులను ఆకట్టుకుందో అంతే స్థాయిలో విమర్శకుల దృష్టిలోనూ నిలిచాయి. అయితే చాలామంది అంతగా పట్టించుకోని అంశాలను ప్రస్తావిస్తూ రాసిన ఆమెను గొప్ప రచయిత్రిగా పాఠకుల లోకం పేర్కొన్నది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మాన్ బుకర్స్ ప్రైజ్ కోసం ఎంపికయిన 13 నవలల సుదీర్ఘ జాబితాలో అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన నవలా రచయిత్రి ఝుంపా లాహిరికి చెందిన ది లోల్యాండ్ అన్నిటికన్నా ముందు వరసలో ఉంది. తనతో పాటు పోటీలో ఉన్న ఇతర ఐదుగురు రచయితలను దాటగలిగితే ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆమెనే వరించవచ్చు.
లండన్‌లో జన్మించిన లాహిరి కుటుంబ సంబంధాల గురించి అత్యంత హృద్యంగా రాసిన ఈ నవల ఆమెతో పోలిస్తే అంతగా పేరు ప్రఖ్యాతులు లేని పలు నవలలతో 50 వేల పౌండ్ల విలువైన ఈ ప్రైజ్ కోసం పోటీ పడుతోంది. లాహిరి కథా కథనం తీరు సాటిలేనిది. భారత్, అమెరికాలతో ముడిపడిన లోల్యాండ్ నవల గత సెప్టెంబర్‌లో ప్రచురణ కావడమే కాకుండా లండన్‌కు చెందిన సాహితీ విమర్శకుల దృష్టిలో ఈ బహుమతికి అన్ని విధాలా తగినదిగా కూడా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్ నుంచి వలస వెళ్లిన కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఝంపా లహరి ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె రాసిన ‘ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మాలడీస్’ అనే కథానికల సంపుటికి సైతం 2000 సంవత్సరంలో పులిట్జర్ బహుమతి లభించింది. 2003వ సంవత్సరంలో ఝంపా తొలి నవల ‘ద నేమ్ సేక్’ని మీరా నాయర్ తెరకెక్కించారు కూడా. బెంగాలీ అయిన జుంపా లాహిరి 1967వ సంవత్సరంలో జులై 11వ తేదీన లండన్‌లో జన్మించారు. జుంపా మూడు సంవత్సరాల వయస్సునప్పుదు ఆమె తల్లిదండ్రులు ఇంగ్లాండు నుండి అమెరికా వలసవెళ్లారు. ఆమె తండ్రి రోడ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేసేవారు. జుంపా రచించిన నవల ద థర్డ్ అండ్ ఫైనల్ కాంటినెంట్‌లో ప్రధాన పాత్రకు తన తండ్రియే ఆధారం.ఎన్నో నవలలను ఆమె రచించి పేరు పొందారు.
ది లోల్యాండ్ కథ విషయానికి వస్తే...
లహరి ఈసారి నక్సల్బరీ మీద దృష్టి పెట్టింది. దున్నేవాడిదే భూమి నినాదంతో 1967లో బెంగాల్‌లో దావానలంలా వ్యాపించిన ఈ ఉద్యమం ఈ కథకు కీలక నేపథ్యం. ఆ సమయంలోనే, అంటే నక్సల్బరీ ఉద్యమం దేశం నలుచెరగులా వ్యాపిస్తున్న సమయంలోనే యవ్వనంలో ఉరకలెత్తే ఇరువురు అన్నదమ్ముల కథ ది లోల్యాండ్. ఈ పేదరికం, దారిద్య్రం పోవాలంటే తుపాకీ పట్టుకోక తప్పదు అని నమ్మిన ఆ అన్నదమ్ముల్లో ఒకడు చాలా త్వరగా ఇందులో ఉన్న ప్రమాదాన్ని గ్రహిస్తాడు.ఉద్యమంలోని కష్టనష్టాలను గమనించి తను విరమించుకుని అమెరికాకు వెళ్లిపోతాడు.
మరొకడు నక్సలైట్‌గా కొనసాగి బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోతాడు. ఈ వార్త విని అమెరికా నుంచి సోదరుడు తిరిగి వచ్చేసరికి ఇటీవలే అతడి జీవితంలో ప్రవేశించిన భార్య. పైగా గర్భవతి. ఆమె దైన్యస్థితిని అర్థం చేసుకున్న సోదరుడు ఆమెను వివాహం చేసుకొని అమెరికా(రోడ్ ఐల్యాండ్)కు తీసుకువెళతాడు. అక్కడ ఆమెకు కుమార్తె పుడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరువురూ ఆ పాపకు అసలు నిజం చెప్పకుండా పెంచి పెద్ద చేస్తారు. కాని రాను రాను భార్యకు అతడితో ఉన్న వైవాహిక సంబంధం నచ్చదు. పెళ్లి వీగిపోతుంది. చివరకు ఏమయ్యింది అనేది కథ.ఈ ఏడాది బుకర్స్ ప్రైజ్ కోసం ఎంపికయిన వారి జాబితాలో మార్గరేట్ అట్‌వుడ్, జెఎం కోజీలాంటి లబ్ధప్రతిష్ఠులు లేకపోవడం గురించి ప్రస్తావిస్తే, అర్హతలేని వారికి అవార్డులు ఇవ్వడం, అర్హులయిన వారిని పక్కన పెట్టడం లాంటి వివక్ష ఏదీ లేదని న్యాయ నిర్ణేతల బృందం అధ్యక్షురాలు రాబర్ట్‌మాక్‌ఫర్లేన్ చెప్పారు. ఈ అవార్డు కోసం ఎంపికయిన నవలల్లో సంప్రదాయ నవల నుంచి ప్రయోగాల దాకా, క్రీస్తుశకం ఒకటో శతాబ్దం మొదలుకొని నేటి దాకా, అలాగే వంద పేజిలనుంచి వెయ్యి పేజీల దాకా ఉండే అన్ని రకాల నవలలున్నాయి.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆర్ట్‌స అండ్ హ్యుమానిటీస్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యురాలిగా జుంపా లహరిని నియమించారు. 1999లో ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మాలడీస్, 2003లో ద నేమ్ సేక్, 2008లో అన్‌అకస్టమెడ్ ఎర్త్ పుస్తకాలనువ అందుబాటులోకి తీసుకువచ్చారు. 1993లో హెన్‌ఫీల్డ్ ఫౌండేషన్ నుంచి ట్రాన్స్ అట్లాంటిక్ అవార్డును, 2002లో గుగెన్‌హీమ్ ఫెలోషిప్‌ను జుంపాలహరి అందుకున్నారు.