నలభై ఏళ్లకీ, యాభై ఏళ్లకీ స్కూబా డైవింగ్ చేసిన వాళ్లున్నారు. కానీ ఊత కర్రతో నడిచే డెబ్భై తొమ్మిదేళ్ల వయసులో పదమూడు వేల ఐదొందల అడుగుల ఎత్తు నుంచి ఆ సాహసం చేసింది అమెరికాకు చెందిన కరోలిన్. ఈ వయసులో అంతటి సాహసం ఎందుకంటే... చిన్న నాటి కలను తీర్చుకోవాలన్న తపనే కారణం అని చెబుతుంది. ''చిన్నప్పట్నుంచీ నాకు స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి. ఓసారి ప్యారాచూట్తో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాను. ఛాతి భాగంలో చిన్న దెబ్బ తగిలింది. వైద్యులు అలాంటి సాహసాలు వద్దని చెప్పారు. నేనూ భయపడి దూరంగా ఉన్నాను. తరవాత పెళ్లయ్యింది. నౌకాదళంలో ఆఫీసర్గా పని చేశాను. ఇంటి బాధ్యతలూ, ఉద్యోగం.. చూస్తుండగానే వృద్ధాప్యం వచ్చేసింది. అయినా మనసులో చిన్నప్పటి కోరిక తీరలేదన్న వెలితి ఉండిపోయింది. ఇదే విషయం మా అబ్బాయిలతో అంటే ఆ సాహసం ఇప్పుడు చెయ్యమన్నారు. దాంతో కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఈ ఫీట్ సాధించగలిగాను' అని చెప్పింది. అప్పుడు భయపడ్డారు కదా, మరి ఇప్పుడెలా చేశారని అడిగితే 'ఇప్పుడూ కొన్ని క్షణాలు భయం వేసింది. ఆ కాసేపు గట్టిగా కళ్లు మూసుకున్నా' అని బదులిచ్చింది.
0 Comments
|