లండన్ ప్రభుత్వం గ్రీన్ ఆస్కార్ ప్రదానం
బడులూ, ఆరోగ్య ేకంద్రాల ఏర్పాటు
నేచర్ కన్జర్వేషన్ పేరుతో ఓ సంస్థ
ప్రకృతిలో ఎన్నో అందాలు. అన్నింటిన చూడడం మనకు సాధ్యం కాదు. కొందరైతే కాంక్రీట్ జంగిల్‌ేక పరిమితం అవుతారు. కానీ కొంత మంది పర్యావరణాన్ని చూస్తే పులకించిపోతారు. ప్రకృతిని ఆరాధిస్తారు. పక్షులను ప్రేమిస్తారు. వాటి శబ్దాలతో సంగీతాన్ని వింటారు. వాటి పరిరక్షణకు నడుంబిగిస్తారు. అలాంటి వారిలో ఒకరు అపారజిత దత్తా. పర్యావరణం కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ వివరాలెమిటో చూద్దాం...
ప్రకృతిని ప్రేమించి... జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి... ‘పర్యావరణాన్ని పట్టించుకుంటే పదికాలాల పాటు మనకే మంచిది’ అంటూ ప్రచారం చేసిన అపరాజిత రెండున్నర లక్షల పౌండ్ల విలువైన ప్రతిష్ఠాత్మక గ్రీన్ ఆస్కార్ పురస్కారాన్ని సాధించింది. అపరాజిత తండ్రి ఉద్యోగ రీత్యా జాంబియాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచీ ఆఫ్రికా చుట్టుపక్కల అడవుల్లోని పక్షులూ, జంతువులూ, పచ్చని చెట్లను చూస్తూ పెరిగిన అపరాజితకు జీవశాస్త్రం ఇష్టమైన పాఠ్యాంశంగా మారింది. దాన్లో పీజీ చదివి, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. కొన్నేళ్లకి ఆమె కుటుంబం స్వస్థలం కోల్‌కతాకి వచ్చేశాక అక్కడే అపరాజిత వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. జీవావరణం అంశంలో పీజీ పూర్తి చేసింది.
మధ్యప్రదేశ్, గుజరాత్ కీకారణ్యాల్లోని పక్షులూ, మొక్కల మీద ఎన్నో అధ్యయనాలు చేసిన ఆమె... అరుణాచల్‌ప్రదేశ్ అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే మూడు ముక్కుల పక్షి హార్న్‌బిల్ జీవనశైలిని ఆసక్తిగా గమనించింది. అవి దట్టమైన అడవుల్లో అన్ని రకాల పండ్లు తింటాయి. గింజల్ని వివిధ ప్రాంతాల్లో వెదజల్లుతాయి. దాంతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోంది. ఆ పక్షుల ప్రత్యేకత, అవి చేస్తున్న మేలు ప్రధానాంశంగా పీహెచ్‌డీ చేసిన అపరాజిత ‘నేచర్ కన్జర్వేషన్’ పేరుతో ఓ సంస్థని స్థాపించింది. అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పక్షులనూ, జంతువులనూ వేటాడకుండా అటవీ సంపదకు నష్టం కలిగించకుండా అవగాహన కల్పించింది. హార్న్‌బిల్‌ల సంఖ్యను పెంచడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి బాధ్యతను గిరిజనులకు అప్పగించింది. అవి పిల్లల్ని పెట్టడం గూళ్లలో పిల్లల్ని పోషించడం తదితర జీవన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి వేటగాళ్ల బారిన పడి అంతరించిపోకుండా కాపాడుతున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పక్షిజాతి పూర్తిగా అంతరించిపోయిందని అయినా వేటగాళ్ల ఉచ్చు కొనసాగుతోంది.
సంచరించే పక్షి జాతుల్లో హార్న్‌బిల్ పెద్దది ఈ అద్భుతమైన పక్షిని బయట ఎలా కాపాడుకోవాలో ఆమె ప్రయత్నిస్తుంటారు. దత్తా అరుణాచల్ ప్రదేశ్‌లో 60 హర్న్‌బిల్ పక్షి గూళ్లను కనిపెట్టుకుని సంరక్షించింది. వలంటీర్ల సాయంతో ఉద్యానవన తోటలు పెంచి, చేతి వృత్తులను ప్రోత్సహించి గిరిజనులకు ఉపాధి మార్గం చూపించింది. బడులూ, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. పదేళ్లు తిరిగే సరికి అపరాజిత కృషి ఫలించింది. పక్షుల సంరక్షణ కేంద్రాల సంఖ్య అరవైకి చేరింది. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీవ వైవిధ్యంపై ఎన్నో పుస్తకాలు రాసిన అపరాజిత, పిల్లల కోసం ప్రత్యేకంగా హార్న్‌బిల్ పక్షుల గురించి పుస్తకం రాసింది. పదేళ్లుగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన లండన్ ప్రభుత్వం ‘గ్రీన్ ఆస్కార్’ ఇచ్చి సత్కరించింది.
హార్నిబిల్ పక్షిజాతి సంరక్షకురాలు అపరాజిత దత్తా గ్రీన్ ఆస్కార్ అవార్డు సాధించారు. ఈ అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ అవార్డును వైట్లీ అవార్డుగా పిలుస్తారు. బ్రిటన్ మహరాణి ఎలిజెబెత్ కుమార్తె రాణి అన్నె ఈ అవార్డును రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఉత్సవ సభలో ప్రదానం చేశారు. మనదేశంలోని అరుణాచల ప్రదేశ్ అడవుల్లో ఎక్కువగా మనుగడ సాగించే హార్నిబిల్ పక్షిజాతి అంతరించిపోతున్న పక్షుల్లో అతి ప్రధానమైనది. బహుమతిగా ఇచ్చిన రూ.30 లక్షల నగదును భారత దేశంలో ఉండే హార్న్‌బిల్ పక్షుల సంరక్షణకు వినియోగిస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. అసోం, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి హార్న్‌బిల్ ఉనికి ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకుంటామని దానికోసం తన బహుమతి నగదు వినియోగిస్తానని ఆమె చెప్పడం దాతృత్వానికి, పక్షులపై ఆమెకు గల ప్రేమకు నిదర్శనం అని చెప్పవచ్చు.